మట్టితో మమేకం..
గ్రామాలు, పల్లెల జీవన విధానం.. స్వచ్ఛమైన ఆహారం, ప్రకృతితో సావాసం, సంస్కృతితో కలగలిసిన సంప్రదాయం, పలు వృత్తుల కలయిక ఇలా.. మనిషి జీవనానికీ పల్లెలకు ఎప్పుటి నుండో ఏర్పడిన బంధం.. వీటన్నింటికీ ప్రధానమైనది వ్యవసాయం.. అలా వ్యవసాయానికీ..పల్లె జీవన విధానానికీ ముడిపడినదే మట్టి.. అలాంటి మట్టితో మమేకమైన జీవన విధానంపై నగరంలో వినూత్న పద్ధతిలో ‘నైమిసం ఎర్త్ ఫెస్టివల్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. పల్లెల్లోని సహజ జీవన విధానాలను తెలియజేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి.. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. సంప్రదాయ వృత్తులు, జీవన విధానాలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో గతకాలపు సాంస్కృతిక జీవన వైవిధ్యం.. ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం.. కలగలిసి ఇవన్నీ ఒకే వేదికగా నగరవాసులకు పరిచయం చేస్తూ.. ప్రస్తుత తరం ఆ తరహా జీవనశైలిలో భాగస్వాములు కావలనే లక్ష్యంతో ‘నైమిసం ఎర్త్ ఫెస్టివల్ 2025’ ఏర్పాటు చేశారు. గచి్చ»ౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా దీనికి వేదికైంది. జె. కృష్ణమూర్తి సెంటర్ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం నగరానికి సహజ జీవన విధానాన్ని, అందులోని మాధుర్యాన్ని, తన్మయత్వాన్ని రుచి చూపించింది. ఈ ఎర్త్ ఫెస్టివెల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు, వ్యక్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ గతకాలపు జ్ఞాపకాలను, జీవన శైలిని ఇప్పటికీ కొనసాగిస్తున్న సుస్థిర విధానాలను అద్భుతంగా ప్రదర్శించారు. అలరించిన నృత్యాలు.. ఈ సందర్భంగా నిర్వహించిన గుస్సాడి నృత్యం అలరించింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, సొసైటీ టు సేవ్ రాక్స్, యానిమల్ వారియర్స్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ఆలోచనలతో చేపట్టిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో వాన్వాడి ఫారెస్ట్ కలెక్టివ్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అసీమ్ శ్రీవాత్సవ వంటి వక్తలు ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.నేనొక చేనేతకారుడిని.. చిన్నప్పటి నుంచి బట్టలు నేయడం మాత్రమే తెలుసు. ఎంత గొప్ప భవిష్యత్తు ఉందన్నా మరో పనికి వెళ్లే ఆలోచన లేనివాళ్లం. ఎక్కువగా సిల్క్ చీరలు నేస్తాను. ఒక్కో చీర నేయడానికి నాలుగు రోజులు పడుతుంది. ఇలా నెల్లో 7, 8 చీరలు నేస్తాను. వినియోగించే దారం, డిజైన్ బట్టి ధర ఉంటుంది. అన్నీ పోనూ ఓ 12 వేల వరకూ మిగులుతుంది. గిట్టుబాటు ధరలు లేకపోవడం ప్రధాన సమస్య. అయినప్పటికీ మా వృత్తిలోనే మాకు సంతృప్తి. ముగ్గురు ఆడపిల్లు.. వారిని పీజీలో, డిగ్రీలో చేరి్పంచాను. – రామక్రిష్ణ, సంస్తాన్ నారాయణపురంమట్టి ఇళ్ల నిర్మాణంపై..100, 150 ఏళ్లపాటు ఘనంగా మనగలిగిన నాటి మట్టి ఇళ్లను మళ్లీ ఈ తరానికి అందించడమే లక్ష్యంగా నిలాలిన్ సంస్థను నా సహవ్యవస్థాపకురాలు యామినితో కలిసి ప్రారంభించాం. ఈ నివాసాల్లోని వైవిధ్యాన్ని, విశిష్టతను ఈ తరానికి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఔత్సాహికులకు జనగామలో మరుతం లెరి్నంగ్ సెంటర్, ఒడిస్సాలో కమ్యూనిటీ సెంటర్, మహబూబ్‌నగర్‌లో మరో మట్టి ఇంటి ప్రాజెక్టు వంటివి చేపట్టాం. ఈ ఇళ్ల నిర్మాణంలో మట్టిలో దృఢత్వానికి ఆవు పేడ, ఫైబర్ రిచ్ వంటివి కలుపుతాం. స్థానికంగా నాటి మట్టి నిర్మాణం తెలిసిన వారి నైపుణ్యాలను వాడుతున్నాం. – ఐశ్వర్య, నిలాలిన్రసాయనాలు లేకుండా.. శాశ్వత వ్యవసాయంగా పిలుచుకునే పర్మాకల్చర్ విధానంలో పంటలు పండిస్తున్నాం. జహీరాబాద్ సమీపంలోని బిడకన్నె గ్రామంలో విభిన్న రకాల పంటలను ఎలాంటి రసాయనాలూ వేయకుండా పండిస్తున్నాం. నరన్న కొప్పుల ఆధ్వర్యంలోని అరణ్య సంస్థ ఈ వ్యవసాయంపై మరింత అవగాహన కల్పిస్తోంది. నాలాగే 500 మంది మహిళా రైతులు ఈ పర్మాకల్చర్ చేస్తున్నారు. తల్లిలాంటి భూమిని రసాయన మందులు వేసి చంపదల్చుకోలేదు. ఆవులు, బర్రెల పేడతో సహజ ఎరువును తయారు చేసుకుని పంటలు పండిస్తున్నాం. పొన్నగంటి, తోటకూర, దొగ్గల్ కూర, తడక దొబ్బుడు వంటి ఆరోగ్యకరమైన ఆకు కూరలు పండిస్తున్నాను. ఎకరంలో దాదాపు 20 రకాల కారగాయలు, ఇతర పంటలను పండించగలను. మందులతో పండిన పంటతో లభాలు ఎక్కువ వస్తాయేమో.. కానీ ఆరోగ్యం కోల్పోయి ఆస్పత్రుల్లో చేరాలి. కరోనా తరువాత ఈ వ్యవసాయం పై మరింత గౌరవం, నమ్మకం పెరిగింది. నా మనుమరాలి పెళ్లి కూడా చేశాను.. ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. మా పంటను ఇష్టపడే వారే మా వద్ద ప్రత్యేకంగా కొంటున్నారు. – తుల్జమ్మ, పర్మాకల్చర్ రైతుసంస్కృతులపై అవగాహన కోసం..సెంటర్ ఫర్ ఎంబారీ నాలెడ్జ్ పేరుతో ఒక సంస్థగా ఆనాటి జీవన విధానం, వ్యవసాయం, నివాసాలు, సంస్కృతులు, పద్ధతులను ఈ తరానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా వర్క్‌షాపులు, కథలు, పాటలు, ప్రాజెక్టుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. తరతరాల వారసత్వంగా వచ్చిన అద్భుత సంస్కృతిని కోల్పోతున్నాం. ఆరేళ్లుగా ఈ అంశాలపైనే కృషి చేస్తున్నాం. ఒక్కో అంశంలో నిపుణులైన ఒక్కొక్కరు బృందంగా ఏర్పడి పనిచేస్తున్నాం. ఒక అరుదైన గ్రామీణ సంగీత కళ లేదా వ్యాయిద్యాన్ని చెప్పుకోవచ్చు. మా ప్రయత్నంలో భాగంగా కొందరికి మట్టి ఇళ్లు కట్టించాం, కథలను చెబుతాం, అసక్తి ఉన్నావారిని ప్రత్యక్షంగా ఈ మూలాల్లోకి తీసుకెళ్లి చూపిస్తాం. నగరానికి సమీపంలోని చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లోని గ్రామాలు మొదలు భద్రాచలం వంటి దూరప్రాంతాల్లోనూ మా ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. – ధీరజ్, సెంటర్ ఫర్ ఎంబారీ నాలెడ్జ్ఎర్త్ అండ్ ఆర్ట్ స్టూడియో.. ఇంటిని, గార్డెన్‌ను అందంగా అలంకరించే టెర్రకోట బొమ్మలు, మట్టి పాత్రలు, దారం అల్లికలు వంటివి తయారు చేస్తున్నాం. నగరంలోని కార్ఖానాలో ఎర్త్ అండ్ ఆర్ట్ అనే మా స్టూడియోలో స్టోన్ కారి్వంగ్, బ్లాక్ ప్రింటింగ్, రేడియం తదితర వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాం. వీటికి అవసరమైన మట్టిని కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఆరి్టఫీíÙయల్ హంగుల కన్నా సహాజమైన కళతో రూపొందించిన ఈ ఉత్పత్తులు ఇంటికే కాకుండా జీవితానికీ సౌందర్యాన్నిస్తాయి. – ఫాతిమా ఖుజీమా, ఎర్త్ అండ్ ఆర్ట్