సాక్షి, సిరిసిల్ల : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సిరిసిల్లలో ముగ్గురు విద్యార్థులపై ప్రతాపం చూపించిన పోలీసులపై ఎస్పీ రాహుల్ హేగ్డే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. క్రమ శిక్షణ చర్యల కింద ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుల్, హోంగార్డును పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఎస్పీ అటాచ్ చేశారు. కాగా వేడుకల సందర్భంగా నలుగురు యువకులపై పోలీసులు కర్రలతో విచక్షణారహింతగా కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో.. ఎస్పీ రాహుల్ సిరియస్‌గా స్పందించారు. (‘ఖాకీ’ మార్కు ప్రతాపం!)
Comments
Please login to add a commentAdd a comment