సర్వోన్నత న్యాయస్థానం పట్ల గౌరవం ఉండాలి
తమ తీర్పును తప్పుబట్టిన హైకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ: గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులను ఉద్దేశిస్తూ పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎగువ కోర్టు పట్ల ఎనలేని గౌరవం చూపాలని, న్యాయ క్రమశిక్షణ పాటించాలని హితవు పలికింది. హరియాణాలోని గుర్గావ్‌లో ఒక భూవివాదానికి సంబంధించిన కేసులో మే మూడో తేదీన సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు జారీచేసింది. అయితే జూలై 17వ తేదీన ఒక కేసును విచారిస్తున్న సందర్భంగా పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌బీర్ సహరావత్ సుప్రీంకోర్టును విమర్శించారు.
‘‘ హైకోర్టుల అధికారాలకు సుప్రీంకోర్టు యథాలాపంగా అడ్డు తగులుతోంది. ఇక తామే ‘సుప్రీం’ అన్నట్లుగా సుప్రీంకోర్టులో విపరీత ధోరణి కనిపిస్తోంది’’ అని జడ్జి సహరావత్ అన్నారు. అయితే ఆరోజు హైకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం కావడంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. విషయం తెల్సుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం ఈ అంశాన్ని బుధవారం విచారించింది.
‘‘ కింద కోర్టులు సుప్రీంకోర్టు తీర్పులను శిరసావహించాల్సిందే. ఇందులో వేరే ఆప్షన్ ఎంచుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ విధి నిర్వహణ. కోర్టుల్లో తీర్పులపై పిటిషనర్లు, కక్షిదారులు అసంతృప్తి వ్యక్తంచేయొచ్చుగానీ జడ్జీలు తమ సొంత వ్యాఖ్యానాలు చేయకూడదు. దేశంలో ఇక ఏ న్యాయస్థానంలోనూ ఇలాంటివి పునరావృతం కాబోవని భావిస్తున్నాం.
కేసు విచారణల ప్రత్యక్ష ప్రసారాల కాలంలో జడ్జీలు ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటపుడు సంయమనం పాటించాలి. అనవసర మాటలొద్దు’’ అని హైకోర్టు జడ్జికి ధర్మాసనం మౌఖిక ఆదేశాలిచి్చంది. జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా రాజ్యాంగంలోని ప్రతి అంగంలోనూ క్రమశిక్షణ అనేది కొనసాగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు ఖచి్చతంగా కోర్టు ధిక్కారమేనని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆ జడ్జిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment