సాక్షి, న్యూఢిల్లీ: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గత నెల 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మామిడన్న సత్యరత్న శ్రీ రామచంద్రరావును పంజాబ్, హరియాణాల హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment