
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సాయుధుడైన ఓ వ్యక్తి దేశ రాజధాని కాబూల్‌లోని హైకోర్టులో పని చేస్తున్న ఇద్దరు మహిళా జడ్జీలను ఆదివారం కాల్చి చంపాడు. జడ్జీలిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా, కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై అఫ్గానిస్తాన్ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి అహ్మద్ ఫహిమ్ స్పందించారు. మరణించిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పనిచేస్తున్నవారేనని ధ్రువీకరించారు. అయితే వారి పేర్లను, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. చదవండి: ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏది?
Comments
Please login to add a commentAdd a comment