
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మంగళవారం హైకోర్టు జడ్జిలకు లేఖ రాశారు. హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్లను.. పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న లాయర్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చీఫ్ జస్టిస్ రమణ.. హైకోర్టు జడ్జిలకు రాసిన లేఖలో కోరారు.
హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సీజేఐకి ఇటీవల రాసిన లేఖను అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు ఎస్‌సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘‘ఎస్సీబీఏ చేసిన అభ్యర్థనను సీజేఐ అంగీకరించారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను తమ హైకోర్టులకు ఎలివేషన్ కోసం పరిగణించాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను అభ్యర్థించింది" అని సింగ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
చదవండి: సుప్రీం తీర్పుల్లో వెలుగు నీడలు!
Comments
Please login to add a commentAdd a comment