44 హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీకి కసరత్తు | Govt initiates process for appointing 44 HC judges after collegium prod | Sakshi
Sakshi News home page

44 హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీకి కసరత్తు

Published Mon, Jun 5 2017 5:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:45 PM

Govt initiates process for appointing 44 HC judges after collegium prod

న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో 44 జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 44 పేర్లను రెండు సార్లు తిరస్కరించిన ప్రభుత్వం.. కొలీజయం తన సిఫార్సును పునరుద్ఘాటించడంతో దిగివచ్చినట్లు సమాచారం. అలహాబాద్‌ హైకోర్టుకు 29 మంది, కర్ణాటక హైకోర్టుకు ఇద్దరు, కోల్‌కతా హైకోర్టుకు ఏడుగురు, మద్రాస్‌ హైకోర్టుకు ఆరుగురు పేర్లను ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన అభ్యర్థులను ప్రభుత్వం జడ్జీలుగా నియమించడం ఆనవాయితీ. అయితే ఇటీవల మోదీ ప్రభుత్వం కొలీజియం సిఫార్సులను రెండుసార్లు తిరస్కరించి పునఃపరిశీలన కోసం తిరిగి కొలీజియానికి పంపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement