
జస్టిస్ శంకర నారాయణ జస్టిస్ పి.కేశవరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయవాద మండళ్లకి (బార్ కౌన్సిల్స్) ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నియమితులయ్యారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు వ్యవహరిస్తారు.
ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శిరేణుక బుధవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్నికలకు 107 నామినేషన్లు, తెలంగాణ ఎన్నికలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. గుర్తింపు కార్డు చూపిన ఓటర్‌కి బ్యాలెట్ ఇస్తారని, ఏపీలో జూలై 11న, రాష్ట్రంలో జూలై 23న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు.