telangana bar council
-
న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ త్వరగా పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి వెంటనే న్యాయవాదులుగా నమోదు చేసుకునే చర్యలు చేపట్టాలని తెలంగాణ బార్ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎన్రోల్మెంట్ తేదీని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జూలై 31న రాసిన లేఖ ఆధారంగా ఎన్‌రోల్‌మెంట్‌ను ఆపేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్ ఆగస్టు 5న సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిలిపివేతను సవాల్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన సాయితేజతో పాటు మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ, న్యాయ విద్య పూర్తి చేసి ప్రొవిజినల్ సరి్టఫికెట్లను పిటిషనర్లు పొందారని, వారి ఎన్రోల్మెంట్కు తెలంగాణ బార్ కౌన్సిల్ తిరస్కరించిందని చెప్పారు. ఎన్రోల్మెంట్ ఫీజును రూ. 750 నుంచి రూ. 1,500కు పెంచడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. రూ. 750 మాత్రమే వసూలు చేయాలని ఆగస్టు 7న ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని తెలిపారు. బీసీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్–బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం న్యాయవాదులుగా ఎన్రోల్మెంట్ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు లభించిందన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగస్టు 6న లేఖ కూడా రాసిందని చెప్పారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం స్వీకరించిన దరఖాస్తులను సరి్టఫికెట్ల పరిశీలన నిమిత్తం యూనివర్సిటీలకు పంపినట్లు చెప్పారు. వాటిపై పరిశీలన పూర్తికాగానే ఎన్రోల్మెంట్ తేదీని ఖరారు చేస్తామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి ఎన్రోల్మెంట్ తేదీని ఖరారు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు. -
దక్షిణాదిలో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి దక్షిణాదిలో సుప్రీంకోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని సౌతిండియా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, సౌతిండియా బార్ కౌన్సిల్ కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సాధన కోసం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లతో ఏర్పడిన కమిటీ సీజేఐకి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కక్షిదారు ఢిల్లీ వరకు రావడం ఖర్చుతో కూడుకున్నదని, ఈ విషయంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరినట్లు వివరించారు. తమ విజ్ఞప్తిపై సీజేఐ, ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సీజేఐ, ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో తమిళనాడు, ఏపీ, కర్ణాటక బార్ కౌన్సిళ్ల చైర్మన్లు పీఎస్ అమల్‌రాజ్, ఘంట రామా రావు, శ్రీనివాస్ బాబు, కేరళ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.ఎన్.అనిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెం బర్ బి.కొండారెడ్డి, రామచందర్‌రావు ఉన్నారు. -
అందుకే దక్షిణాది రాష్ట్రాల నుంచి తక్కువ అప్పీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అందించిన హక్కులు ప్రజలందరికీ సమానంగా అందాలంటే దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు–పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బి.కొండారెడ్డి అధ్యక్షతన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ఎ.నరసింహారెడ్డి, గంటా రామారావు, పీఎస్ అమల్‌రాజ్, కేపీ జయచంద్రన్, ఎల్.శ్రీనివాసబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ వేల కిలోమీటర్ల దూరంలో ఉండటం.. సుప్రీంకోర్టు న్యాయవాదులు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల హైకోర్టుల నుంచి దాదాపు 3 శాతం మాత్రమే సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలవుతున్నాయని వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లే సమయం, డబ్బు వెచ్చించలేక అప్పీళ్లు దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఢిల్లీ హైకోర్టు నుంచి 9.5 శాతం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి దాదాపు 5 నుంచి 6 శాతం అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’) దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. లా కమిషన్ చైర్మన్లు జస్టిస్ కె.కె.మాథ్యూ, జస్టిస్ దేశాయ్, జస్టిస్ లక్ష్మణన్‌లు దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారని గుర్తుచేశారు. సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలంటూ అన్ని బార్ కౌన్సిళ్లు తీర్మానం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు బెంచ్ సాధన సమితి కన్వీనర్‌గా ఎ.నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు తెలిపింది. కరోనా కారణంతో లాక్డౌన్ విధించడంతో ఇబ్బంది పడుతున్న అడ్వకేట్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది అడ్వకేట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని బార్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 40,000వేల మంది అడ్వకేట్లు ఉన్నారని వారిలో కొత్తగా ఈ వృత్తిని ఎంచుకున్న వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని బార్ కౌన్సిల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం) కేవలం ఈ వృత్తి మీదే ఆధారపడిన వారు కేసులు లేక జీవనం కొనసాగించడం కష్టంగా ఉందని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ. 25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు గాను బార్‌కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (వలస కార్మికులను పంపిస్తాం : కానీ...!) -
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయవాదుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో పార్టీ ప్రకటించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు పథకాలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లతోపాటు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్టుకు మరిన్ని నిధులు కేటాయించాలని, ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్‌కార్డులు జారీ చేయాలని న్యాయవాద ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ల ప్రతిపాదనలను కేటీఆర్‌కు సమర్పించారు. మేనిఫెస్టోలో న్యాయవాదులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. మేని ఫెస్టో కమిటీకిడిమాండ్ల ప్రతిని ఇస్తామన్నారు. -
ముగిసిన ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో గెలుపొందిన 25 మంది పేర్లను బార్ కౌన్సిల్ అధికారులు ప్రకటించారు. చలసాని అజయ్‌కుమార్, బి.వి.కృష్ణారెడ్డి, ఆలూరు రామిరెడ్డి, కలిగినీడి చిదంబరం, వి.చంద్రశేఖర్‌రెడ్డి, వేలూరి శ్రీనివాసరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎన్.ద్వారకనాథరెడ్డి, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, ఎస్.కృష్ణమోహన్, సోమసాని బ్రహ్మానందరెడ్డి, కె.రామజోగేశ్వరరావు, ముప్పాళ్ల సుబ్బారావు, నరహరిశెట్టి రవికృష్ణ, కొవ్వూరి వెంకటరామిరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, పి.రవి గువేరా, బి.అరుణ్‌కుమార్, పి.నర్సింగరావు, గంటా రామారావు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, జి.వాసుదేవరావు, చిత్తరవు నాగేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావులు గెలిచిన వారిలో ఉన్నారు. ఈ 25 మందిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. గెలిచిన ఈ 25 మందిలో నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఆగస్టు నెలాఖరుకల్లా చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రారంభమైన తెలంగాణ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ బార్ కౌన్సిల్‌కు మొత్తం 86 మంది పోటీ చేశారు. సోమవారం సాయంత్రం లెక్కింపు పూర్తయ్యే సమయానికి 280 ఓట్లతో గండ్ర మోహనరావు లీడింగ్‌లో ఉన్నారు. తరువాతి స్థానాల్లో ఉన్న ఎన్.హరినాథ్ 132 ఓట్లు, ఎ.నర్సింహారెడ్డి 131, ఎ.గిరిధరరావు 126, ముఖీద్ 96 ఓట్లు సాధించారు. -
బార్ కౌన్సిల్స్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయవాద మండళ్లకి (బార్ కౌన్సిల్స్) ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నియమితులయ్యారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు వ్యవహరిస్తారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శిరేణుక బుధవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్నికలకు 107 నామినేషన్లు, తెలంగాణ ఎన్నికలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. గుర్తింపు కార్డు చూపిన ఓటర్‌కి బ్యాలెట్ ఇస్తారని, ఏపీలో జూలై 11న, రాష్ట్రంలో జూలై 23న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. -
హైకోర్టు, బార్ కౌన్సిల్, కేంద్రానికి సుప్రీం నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై మీ వైఖరి ఏమిటో వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రానికి..న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ గతేడాది ఆగస్టులో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.