సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో గెలుపొందిన 25 మంది పేర్లను బార్ కౌన్సిల్ అధికారులు ప్రకటించారు. చలసాని అజయ్‌కుమార్, బి.వి.కృష్ణారెడ్డి, ఆలూరు రామిరెడ్డి, కలిగినీడి చిదంబరం, వి.చంద్రశేఖర్‌రెడ్డి, వేలూరి శ్రీనివాసరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎన్.ద్వారకనాథరెడ్డి, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, ఎస్.కృష్ణమోహన్, సోమసాని బ్రహ్మానందరెడ్డి, కె.రామజోగేశ్వరరావు, ముప్పాళ్ల సుబ్బారావు, నరహరిశెట్టి రవికృష్ణ, కొవ్వూరి వెంకటరామిరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, పి.రవి గువేరా, బి.అరుణ్‌కుమార్, పి.నర్సింగరావు, గంటా రామారావు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, జి.వాసుదేవరావు, చిత్తరవు నాగేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావులు గెలిచిన వారిలో ఉన్నారు. ఈ 25 మందిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. గెలిచిన ఈ 25 మందిలో నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఆగస్టు నెలాఖరుకల్లా చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రారంభమైన తెలంగాణ ఓట్ల లెక్కింపు..
తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ బార్ కౌన్సిల్‌కు మొత్తం 86 మంది పోటీ చేశారు. సోమవారం సాయంత్రం లెక్కింపు పూర్తయ్యే సమయానికి 280 ఓట్లతో గండ్ర మోహనరావు లీడింగ్‌లో ఉన్నారు. తరువాతి స్థానాల్లో ఉన్న ఎన్.హరినాథ్ 132 ఓట్లు, ఎ.నర్సింహారెడ్డి 131, ఎ.గిరిధరరావు 126, ముఖీద్ 96 ఓట్లు సాధించారు.
ముగిసిన ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు
Published Tue, Jul 24 2018 1:30 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment