వ్యవసాయ బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మకూరు(మహబూబ్‌నగర్): వ్యవసాయ బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఏఈగా పని చేస్తున్న జాకబ్ ఆశీర్వాదం ఓ రైతుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రూ. 15 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏఈ జాకబ్ ఆశీర్వాదంను అవంతి హోటల్‌లో లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.