సంతోష్ జేనా
భువనేశ్వర్ : ఆధార్ కార్టులో పొరపాటు వల్ల ఓ ఉద్యోగి తీవ్ర మనోవేదనకు గురౌతున్నాడు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తుందనుకున్న తన ఈపీఎఫ్ (ఉద్యోగ భవిష్యనిధి) ఎందుకూ పనికిరాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. మయూర్‌బంజ్ జిల్లాలోని బరిపడాకు చెందిన సంతోష్ జేనా విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో చిరుద్యోగి. అసలే అంతంత మాత్రంగా ఉన్న తన జీతంతో కుటుంబ పోషణ భారమైంది. అప్పుల్లో కూరుకుపోయిన తనకు ఈపీఎఫ్ ఆసరా అవుతుందనకున్న సంతోష్‌కు ఊహించని షాక్ తగిలింది. సెటిల్‌మెంట్ కోసం ఈపీఎఫ్ ఆఫీస్‌కు వెళ్లగా.. ‘నీ ఆధార్ కార్డులో లోపం ఉంది. దానిని సరిచేయించి తీసుకొస్తేనే డబ్బులిస్తాం’ అని అధికారులు స్పష్టం చేశారు.
ఆదుకోకపోతే.. ఆత్మహత్యే..
ఆధార్ కార్డులో తప్పుడు ఎంట్రీవల్ల ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోతున్నానని సంతోష్ మీడియా ఎదుట వాపోయాడు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తన సమస్యను పరిష్కరించకపోతే... తనకు చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు గతవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment