
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు గారికి,
విద్యుత్ కాంట్రాక్టు (ఆర్టిజాన్) కార్మికుల సమ్మె గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురు కుగా పాల్గొన్న ప్రక్రియ కూడా మీకు తెలుసు. ఈ కార్మికులనుద్దేశించి మింట్ కాంపౌండ్‌లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డుతూనే వాళ్లందరి సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్న సభలో నేను కూడా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడి నాలు గేళ్లైంది. ఇక ఎన్నికలకు పది నెలలు మాత్రమే మిగి లాయి. గతంలో వీళ్లు చేసిన రెండు సమ్మెల ఫలి తంగా వీళ్లని ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్టు ఉద్యమంగా మారుస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా హర్షించాం. అదే క్రమంలో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వం సాధించగలిగింది. ఈ సాధనలో 23వేల మంది కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఏమిటో మీకు తెలుసు. అది గుర్తించే వీళ్లందరినీ పర్మ నెంట్ చేయాలనే ఒక నిర్ణయం మీరు తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒక కీలకమైన నిర్ణయం.
విద్యుత్ బోర్డుకు సారథ్యం వహిస్తున్న ప్రభాకర్ రావు నేతృత్వంలో, సాధక బాధకాలను, చట్టపర అడ్డంకులను పరిశీలించాకే ఈ 23 వేల మందిని నాలుగు కేటగిరీల కింద విభజించి చాలా శాస్త్రీయం గానే వీళ్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీఓను విడు దల చేసింది. దీనిని సవాలు చేస్తూ కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో ఎవరో ఒక అనామకుడు కోర్టులో ప్రజా వ్యాజ్యం కింద కేసు వేశాడు. కోర్టు దీనిమీద స్టే ఇచ్చిన విషయం మీకు తెలుసు. అప్పట్లో కోర్టు డైరెక్టు పేమెంటును సమర్థించింది. అంటే కాంట్రా క్టర్ల వ్యవస్థను తిరస్కరించింది. మీరు ఇంత ప్రతి ష్టగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కౌంటర్ వేసి అప్పటి అడ్వొకేట్ జనరల్ ద్వారా వాదనలు విని పించి స్టేను ఎత్తివేసే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది. ఇదంత కష్టమైన పనేం కాదు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 30 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సర్వీసులని క్రమబద్ధీకరించారు.
కోర్టు స్టే తర్వాత కౌంటర్ వేయడంలో కాని ఈ ఉద్యోగుల క్షేమ సమాచారాలను కాని ప్రభుత్వం పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదని మేం భావిస్తున్నాం. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సంద ర్భంలో మీరు ఒక ఇంక్రిమెంట్ ప్రకటించినప్పుడు ఆ ఇంక్రిమెంట్ ఈ 23 వేల మందికి ఇవ్వలేదు. ఈ 23 వేల మంది పాత్ర లేకుండానే 24 గంటల విద్యుత్ సాధ్యమయ్యిందా? పర్మినెంట్ చేయాలని నిర్ణయిం చినప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఎందుకు అంత వెనుకంజో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఇంక్రి మెంట్ కానీ లేదా వాళ్లకు అంగీకరించిన టైం స్కేళ్లు ఇవ్వడానికి కోర్టుకు ఏం అభ్యంతరం ఉంటుంది? అభ్యంతరమల్లా క్రమబద్ధీకరణ మీదే.
విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీసు దాదాపు 40 రోజుల కిందే ఇచ్చారు. ప్రభుత్వం ఏదో సహాయం చేద్దామంటే సమ్మెకు నోటీస్ ఇవ్వడమేంటి అని ప్రభు త్వం భావించి ఉండవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను కోర్టులో సకాలంలో సమర్థించు కోలేకపోతే, ఆ దిశలో ఏం చర్యలు తీసుకోకపోతే కార్మికులు ఏం చేయాలి? తెలంగాణ ప్రకటించి జాప్యం చేస్తే మనం ఉద్యమాలు చేయలేదా? ఉద్య మాలు చట్టబద్ధం కాదు, సమ్మెచేస్తే చర్యలు తీసు కుంటాం అని అంటే, వేరే మార్గాలేమిటో ప్రభుత్వం సూచించాలి. సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టు కున్నారు. ఒకటీ రెండు సందర్భాలలో ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారిని కార్మికులు కలిసినప్పుడు నేను కూడా వెళ్లాను. ఇవ్వన్నీ పాత డిమాండ్సే కదా అన్ని పరిశీలనలో ఉన్నాయని మాత్రం సమాధానం చెప్పారు. రెండు, మూడు రోజుల క్రితం లేబర్ కమి షనర్ చర్చలకు పిలిచి ప్రతి డిమాండ్‌కు యాంత్రి కంగా స్పందించారే తప్ప, పరిష్కారాలను సూచించ లేదు. సమ్మె హక్కు రాజ్యాంగంలోనే ఉంది. బ్రిట న్‌లో సమ్మె హక్కు లేదు. కానీ సంప్రదింపుల యంత్రాంగం చాలా పటి ష్టంగా ఉంది.
ఈ సమ్మెను మీరు సరిౖయెన స్ఫూర్తితో అవ గాహన చేసుకొని సంప్రదింపులు జరిపి తగు నిర్ణ యాలు తీసుకోండి. వారి డిమాండ్‌లలో క్రమబద్ధీ కరణ అంశం కోర్టు ముందు ఉంది కాబట్టి దాని విష యంలో తక్షణమే కౌంటర్ వేసి అవసరమైతే సుప్రీం కోర్టు లాయరుకు అప్ప జెప్పండి. మీరే అంగీకరించి జీవో ఇచ్చిన జీతభత్యాలను, అంటే నాలుగు స్కేళ్లను అమలు చేయండి. కోర్టు అభ్యంతరం చెబితే ప్రభుత్వ దృక్పథాన్ని, వాదనని కోర్టుకు చెప్పి ఒప్పిం చేలా ప్రయత్నం చేయండి. రాజకీయాలంటేనే సమస్యలను పరిష్కరించడం. సమ్మెను శాంతి భద్ర తల సమస్యల్లా చూడకండి. తక్షణమే స్పందించి, మీరు తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయండి అంటున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేసే డిమాం డ్లను సుముఖంగా పరిష్కరించండి.
గౌరవ అభినందనలతో...
ప్రొ జి. హరగోపాల్
వ్యాసకర్త విద్యుత్ కార్మికుల సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment