పండుగ చేసుకున్నారు... బ్యాండ్‌తో తీన్మార్ స్టెప్‌లు వేశారు.. ఇది పెళ్లికో, పేరంటానికో కాదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో ఎస్‌ఈగా పని చేసిన ఉత్తమ్ కుమార్ బదిలీ కావడంతో ఉద్యోగులు పండుగ చేసుకున్నారు. ఇలా పండుగ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఒక అధికారి బదిలీ అయితే సహ ఉద్యోగులు ఇలా పండుగ చేసుకుంటారా అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారి బదిలీతో పండుగ చేసుకున్న వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లంచాలను కట్టడి చేసిన అధికారి బదిలీ కావడంతో సంబరాలు చేసుకోవడం స్థానికుల్లో ఆగ్రహం తెప్పించింది. ఏకంగా బ్యాండ్ వాయిద్యాలతో మరీ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ముందు చిందులు వేయడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment