
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లు గా పనిచేస్తున్న వారికి ఐదేళ్లకోసారి పదోన్నతి కల్పించనున్నారు. ఓ గ్రేడ్‌లో కనీసం ఐదేళ్ల సర్వీ సు ఉంటే దానికి పైన ఉండే గ్రేడ్‌కు స్థాయిని పెంచనున్నారు. అంటే, గ్రేడ్–4 ఆర్టిజన్‌గా ఐదే ళ్ల సర్వీసు ఉన్న వారికి గ్రేడ్–3 ఆర్టిజన్లుగా పదోన్నతి కల్పించనున్నారు. అలాగే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రేడ్–3 ఆర్టిజన్లను గ్రేడ్–2గా, గ్రేడ్–2 ఆర్టిజన్లను గ్రేడ్–1గా పదో న్నతి ఇవ్వనున్నారు. గ్రేడ్ మారితే ఆర్టిజన్ల వేతనాలు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఆర్టిజన్లకు ఏక మొత్తం (కన్సాలిటెడ్) వేతనాన్ని మాత్రమే చెల్లిస్తుండగా, ఇకపై వారికి సైతం రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో టీఏ, ఇంక్రిమెంట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియా, సెలవులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయనున్నారు.
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సంస్థ ల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 23 వేల మంది కార్మికులు, ఉద్యోగులను ఆయా విద్యు త్ సంస్థలు 2018, సెప్టెంబర్‌లో ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను 4 గ్రేడ్లుగా విభ జించారు. తాజాగా ఆర్టిజన్ల కోసం విద్యు త్ సంస్థల యాజమాన్యాలు ‘స్టాండింగ్ ఆర్డర్స్’పేరుతో ముసాయిదా సర్వీస్ రూల్స్‌ను రూ పొందించి రాష్ట్ర కార్మిక శాఖ ఆమోదం కోసం పంపించాయి. బదిలీల విషయం మినహాయిస్తే మిగిలిన అన్ని అంశాల్లో 4 విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన సర్వీసు రూల్స్ ఒకేలా ఉన్నాయి. ఈ మూసాయిదా సర్వీసు నిబంధనలపై ఆ శాఖ ప్రస్తుతం కార్మిక సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. కార్మిక శాఖ ఆమోదిస్తే ఈ సర్వీసు రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆర్టిజన్ల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించడం గమనార్హం.
ఆర్టిజన్లకూ బదిలీలు!...
విద్యుత్ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టిజన్లు ఒకే చోట పనిచేస్తున్నారు. కొత్త సర్వీస్ రూల్స్ అమల్లోకి వస్తే విద్యుత్ సంస్థల అవసరాల మేరకు వీరికి బదిలీలు నిర్వహించనున్నారు. ఒక చోటు నుంచి మరో చోటికి సమాన పోస్టుకు బదిలీ చేయనున్నారు. వీరికి బదిలీ చేసే అధికారం ఎవరికి ఉండాలన్న విషయంలో మాత్రం విద్యుత్ సంస్థలు వేర్వేరు నిబంధనలు రూపొందించాయి. ఆర్టిజన్ల సీనియారిటీ గణన, సెలవు ల మంజూరు తదితర అంశాలను ఈ సర్వీసు రూల్స్‌లో చేర్చారు.
రూ.6 లక్షల వైద్య సదుపాయం
ఈఎస్‌ఐ సదుపాయం లేని ఆర్టిజన్లకు విద్యుత్ సంస్థలు వైద్య సదుపాయం కల్పించనున్నాయి. ఇందుకోసం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, ఆర్టిజన్ల వేతనం నుంచి ప్రతి నెలా రూ.500 రికవరీ చేయనున్నాయి. ప్రతి ఆర్టిజన్‌కు ఏటా రూ.6 లక్షల లోపు కుటుంబ వైద్య సదుపాయాన్ని కల్పించనున్నాయి. ఆర్టిజన్‌తో పాటు జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు వైద్య సదుపాయానికి అర్హులు. 25 ఏళ్ల లోపు వయస్సు వరకు కొడుకు, పెళ్లి/ఉద్యోగం పొందే వరకు కూతురు వైద్య సేవలకు అర్హులు.
Comments
Please login to add a commentAdd a comment