భార్యను హతమార్చిన భర్త
భార్యను హతమార్చిన భర్త
Published Mon, Jan 9 2017 9:13 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
సౌపాడు (వట్టిచెరుకూరు): మండల పరిధిలోని సౌపాడు గ్రామంలోని బురదగుంటపల్లె ఎస్సీ కాలనీకి చెందిన నూతనపాటి మౌనిక (26) అనే వివాహిత సోమవారం దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.... సౌపాడు గ్రామానికి చెందిన నూతనపాటి మౌనికకు ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావుకి గతేడాది వివాహమైంది. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు కొంతకాలం జిల్లాలోని అమృతలూరు గ్రామంలో, ఆ తర్వాత మౌనిక స్వగ్రామైన సౌపాడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మౌనిక వెంకటేశ్వర్లు పెళ్ళి రోజు కావటంతో ఇంటి వద్దె ఉన్నారు. ఇంట్లో భార్య మౌనికపై భర్త దాడి చేసి గొంతు నులిమి చంపి ఇంటికి గడి పెట్టి ఊరు వదిలి పారిపోయాడని తెలిపారు. భార్యను హతమార్చిన వెంకటేశ్వరరావు ఊరు దాటి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి మౌనిక పెద్దమ్మ, పెద్దనాన్నలకు ఫోన్ చేసి మీ అమ్మాయిను చంపాను, ఇంట్లో ఉందని తెలిపాడు. దీంతో కంగారుపడిన వారు మౌనిక తమ్ముడు రత్నరాజుకు సమాచారం అందించారు. మౌనిక తమ్ముడు రత్నంరాజు, తల్లిదండ్రులు ఇంటికి చెరుకుని పరిశీలించగా మౌనిక మృతి చెంది ఉండటం గమనించి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నాలుగు నెలల గర్భిణి అయిన మౌనిక హత్యకు గురవటంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement