భార్యపై అనుమానంతో వికృత చేష్టలు | Husband Brutally Attacked On Wife In Kurnool District | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానంతో వికృత చేష్టలు

Published Thu, Jun 7 2018 12:33 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

Husband Brutally Attacked On Wife In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూల్‌: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నఓ ప్రబుద్ధుడు ఆమెపై వికృత చేష్టలకు దిగాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేగింది. కృష్ణగిరిలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె శరీర భాగాలపై కత్తితో దాడి చేసి, గాయాలపై కారం చల్లి.. చెప్పలేని రీతిలో ఆమెను నరకమాతనకు గురిచేశాడు. దీంతో భర్త పెట్టె హింసలను తట్టుకోలేక అతను ఇంట్లో లేని సమయంలో పారిపోయి వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త రాజు కోసం గాలింపు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement