brutally attacked
-
ఇసుక వివాదం: తండ్రీ, కొడుకుల హత్య..
భోపాల్ : ఇసుక గొడవ కారణంగా పక్కింటి వారు దాడి చేయడంతో తండ్రీ, కొడుకులు మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న టికంగఢ్ గ్రామంలో దేశ్రాజ్(57) కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పొరుగున ఉన్న మోహన్‌లోధి, తన కుమారుడు బృందావన్ లోధితో కలిసి తమ ఇంటి ముందు ఇసుకను కడుగుతుండగా ఇందుకు దేశ్రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇసుక కడిగిన నీళ్లన్నీ తమ ఇంట్లోకి వస్తుందని వాదించాడు. దీంతో కోపానికి గురైన మోహన్‌లోధి దేశ్రాజ్పై గొడవకు దిగారు. ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదం పెద్దది కావడంతో మోహన్ లోధి, బృందావన్ లోధి తమ కుటుంబ సభ్యులతో కలిసి దేశ్రాజ్పై కర్రలతో దాడికి తెగబడ్డారు. (పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి ) ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు వెళ్లిన దేశ్రాజ్ కుమారులు గులాబ్, జహార్‌తోపాటు ఆయన భార్యపైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘర్షణలో గులాబ్ అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేశ్రాజ్ కూడా మృతి చెందాడు. కాగా దేశ్రాజ్ భార్య సోనాభాయి, మరో కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తండ్రీ, కొడుకుల హత్య కేసుకు సంబంధించి మొత్తం 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బ్రజేష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఘటన అనంతరం పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బెంగళూరు: కూతురిపై తండ్రి అఘాయిత్యం) అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి! -
కర్నూల్: భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త
-
భార్యపై అనుమానంతో వికృత చేష్టలు
సాక్షి, కర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నఓ ప్రబుద్ధుడు ఆమెపై వికృత చేష్టలకు దిగాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేగింది. కృష్ణగిరిలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె శరీర భాగాలపై కత్తితో దాడి చేసి, గాయాలపై కారం చల్లి.. చెప్పలేని రీతిలో ఆమెను నరకమాతనకు గురిచేశాడు. దీంతో భర్త పెట్టె హింసలను తట్టుకోలేక అతను ఇంట్లో లేని సమయంలో పారిపోయి వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త రాజు కోసం గాలింపు చేపట్టారు. -
షాకింగ్ వీడియో హల్చల్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్‌ను వెంటాడి మరీ దాడిచేసిన దృశ్యాలు అంటూ చెబుతున్న షాకింగ్ వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. కశ్మీర్ అల్లర్లలో సాయుధుడైన సీఆర్ పీఎఫ్ జవాన్‌ను కొందరు చుట్టుముట్టారు. చివరికి తప్పించుకొని పోతున్న ఆ జవాన్‌ను వెంటాడి అమానుషంగా సామూహికంగా దాడిచేశారు. 'ది ఇల్లీగల్ ఇండియన్' పేరుతో శనివారం పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ అయింది. ఎపుడు, ఎక్కడ అనే పూర్తి వివరాలు తెలియని ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో జోరుగా షేర్ అవుతోంది. మరోవైపు ఈ సంచలన వీడియో పై అటు పోలీస్ వర్గాలనుంచిగానీ, ఇటు అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. -
ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి
బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది. ఏటీఎంలోకి వచ్చిన జ్యోతి ఉదయ్ ఆమె వెనుకనే లోనికి వచ్చి షట్టర్ మూస్తున్న దుండగుడు ఓ చేతిలో పిస్తోలు, మరో చేతిలో కత్తితో అరవొద్దని జ్యోతిని బెదిరిస్తూ... ఆమెను మూలకు నెట్టి కత్తితో దాడి చేస్తూ... కత్తికి అంటిన రక్తం మరకలు శుభ్రం చేసుకుంటూ... తర్వాత బయటకు వెళ్లిపోతూ... -
బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి
వేట కత్తితో దుండగుడి బీభత్సం.. బెంగళూరులో ఘటన మహిళ తల, ముక్కు, నుదుటిపై తీవ్ర గాయాలు బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది. మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ (38) ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లారు. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు. హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత ఆమె ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయాడు. వెళుతూ షట్టర్ కిందికి దించేశాడు. మూడు గంటల తర్వాత ఏటీఎం సెంటర్ బయట రక్తం మరకలు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమెను తొలుత నిమ్హాన్స్ ఆస్పత్రికి, అనంతరం బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ఎస్జే పార్కు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే డీసీపీ రవికాంత్ గౌడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలను రప్పించారు. దుండగుడి వేలిముద్రలు సేకరించారు. ఆమెకు సంబంధించిన రూ. 2,500 నగదు, సెల్‌ఫోన్ దాడి చేసిన వ్యక్తి ఎత్తుకెళ్లాడని డీసీపీ చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. అయితే, దుండగుడు ఒక్కడే వచ్చాడా.. లేక బయట మరొకరిని కాపలా ఉంచి లోపలికి ప్రవేశించాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. దుండగుడి దారుణకాండ అంతా ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దాంట్లో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది. కాగా, ఈ ఏటీఎం కేంద్రం ట్రాఫిక్ సిగ్నల్ పక్కనే ఉంది. రోజూ వేకువ జాము నుంచే ఇక్కడ రద్దీగా ఉంటుంది. అలాంటి చోట ఈ సంఘటన జరగడంతో నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.