బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది.
ఏటీఎంలోకి వచ్చిన జ్యోతి ఉదయ్
ఆమె వెనుకనే లోనికి వచ్చి షట్టర్ మూస్తున్న దుండగుడు
ఓ చేతిలో పిస్తోలు, మరో చేతిలో కత్తితో అరవొద్దని జ్యోతిని బెదిరిస్తూ...
ఆమెను మూలకు నెట్టి కత్తితో దాడి చేస్తూ...
కత్తికి అంటిన రక్తం మరకలు శుభ్రం చేసుకుంటూ...
తర్వాత బయటకు వెళ్లిపోతూ...