journy
-
భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్.. డెలివరీ బాయ్ ఫ్యామిలీ వీడియో వైరల్!
సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మాలవీయ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక జంటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది ఆ దంపతుల ప్రేమకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె. ‘నువ్వుండగా నాకు మరేం కావాలి?.. ఈ పాట ఒరిజినల్ వీడియోగా ఇది ఉండాలి’ అని రాశారు. పిల్లాడిని ఎత్తుకున్న భర్త, సైకిల్ నడుపుతున్న భార్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనంతా ముగిసి, చీకటిపడ్డాక తన భార్య, పిల్లాడితో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు ధరించిన ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని ఎత్తుకుంటాడు. అతని భార్య సైకిల్ హ్యాండిల్ పట్టుకుని దానిని ముందుకు నడుపుతుంటుంది. కుటుంబం కోసం కష్టిస్తున్న భర్త, అతనికి సాయం అందిస్తున్న భార్యతో కూడిన ఈ వీడియో హృదయాలకు హత్తుకునేలా ఉంది. “Tu hai to mujhe fir aur kya chahiye” This should be the official video of the song ❤️ pic.twitter.com/G9MQOnfW9x — Swati Maliwal (@SwatiJaiHind) July 7, 2023 భార్యాభర్తల బంధం ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఆ మహిళ తమ పిల్లాడితో పనికి వెళ్లిందని, భర్త సైకిల్‌పై జొమోటా డెలివరీ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇద్దరి పనులు ముగిశాక రాత్రి ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. స్వాతి మాలవీయ్ షేర్ చేసిన ఈ పోస్టుకు కొద్ది గంటల వ్యవధిలోనే 56 వేల మంది వీక్షించారు. 19 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా చదవండి: వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా.. -
విలువైన వస్తువులను ఖాళీ చిప్స్ ప్యాకెట్లో పెడితే.. ఫ్లైట్ అటెండెంట్ సలహా!
మనం ఏదైనా పెళ్లి లేదా పెద్దపెద్ద ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మనతో పాటు విలువైన వస్తువులు అంటే.. బంగారు ఆభరణాలు, విలువైన గాడ్జెట్స్ తీసుకువెళుతుంటాం. ఇటువంటి వేడుల సందర్భంలో బంధువుల సందోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనతోపాటు తీసుకువచ్చిన విలువైన సామాను చోరీ జరిగే అవకాశం ఉండవచ్చు. అలాగని ప్రతి నిముషం మన విలువైన వస్తువులను కంట కనిపెట్టుకుని ఉండలేం. పైగా ఇటువంటి సందర్భాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరిపైనా నిందలు కూడా వేయలేం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఫ్లైట్ అటెండెంట్ సలహా.. ఫ్లైట్ అటెండెంట్ మైగుల్ మనోజ్ ఇటీవల సోషల్ మీడియాలో..విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు ఒక ఆశ్చర్యకరమైన లైఫ్ హ్యాక్ తెలియజేశారు. ఇది అందరికీ ఎంతగానో ఉపకరిస్తుంది. మన దగ్గరున్న విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ఖాళీ చిప్స్ ప్యాకెట్స్ మన దగ్గర ఉంచుకోవాలని అయన సలహా ఇచ్చారు. నిజానికి మనం ఖాళీ చిప్స్ ప్యాకెట్లను చెత్తగా భావించి, బయటపారవేస్తుంటాం. అయితే విలువైన వస్తువులను ఎవరూ గుర్తించలేని చోట పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. చిప్స్ ప్యాకెట్‌తో పనేంటి? తాను చిప్స్ ప్యాకెట్ లైఫ్ హ్యాక్‌ను ఫాలో చేస్తానని చెప్పిన ఆయన.. తాను ఏదైనా హోటల్లో బస చేసినప్పుడు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో విలువైన వస్తువులను దాచివుంచుతానన్నారు. దీంతో ఎవరూ కూడా విలువైన వస్తువులు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో ఉంటాయనే విషయాన్ని అంచనా వేయలేరన్నారు. సాధారణంగా చోరీకి పాల్పడేవారు అల్మరాలు, సూట్‌కేసులు, బ్యాగులను, పర్సులను గమనించి వాటిని తస్కరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా విలువైన వస్తువులు అక్కడే ఉంటాయనే భావనతో చోరులు వాటిపై కన్ను వేస్తారు. దొంగకు దిమ్మతిరిగిపోయేలా.. ప్రయాణ సమయంలో లేదా వేడుకల సందర్భంలో ఖాళీ చిప్స్ ప్యాకెట్ లేదా ఖాళీ టిన్లలో విలువైన వస్తువులను ఉంచితే దొంగలు వాటిని పసిగట్టలేరు. ఫలితంగా మన విలువైన సామాను సురక్షితంగా ఉంటుంది. కాగా మైగుల్ మనోజ్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఈ సలహా చాలామందికి నచ్చలేదు. విలువైన వస్తువులను మనం ధరించే దుస్తులలోని సీక్రెట్ పాకెట్లు, ధార్మిక గ్రంథాలు, ఖాళీ కాస్మొటిక్ డబ్బాలలో ఉంచడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్.. -
ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి. వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. Just 2 days back, there was a train accident in Balasore, India. Too many died and a lot more had serious injuries. A bundle of love letters and poems were found amongst the debris on the tracks. A glimpse of a lost romance. A rarity in this age. Give this post a read. pic.twitter.com/MHUq8LplyD — Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023 -
'తిరుగు' ప్రయాణ కష్టాలు
– దసరా సెలవులు ముగియడంతో పట్టణాలకు వెళ్లిన జనం – కిటకిటలాడిన కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్ – గంటల సేపు నిరీక్షణ.. సీట్లు లేక స్టాండింగ్ ప్రయాణం కర్నూలు(రాజ్‌విహార్): దసరా సెలవులు పూర్తవడంతో పల్లెలకు వచ్చిన జనం పట్టణాల బాట పట్టారు. విద్యా సంస్థలు 13వ తేదీ నుంచి తెరుచుకోనుండడంతో పల్లెకు వెళ్లిన విద్యార్థులు సైతం బ్యాగులు సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బుధవారం.. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. సాధారణ సర్వీసులోపాటు ప్రత్యేక బస్సులు, రైళ్లు కిక్కిరిసి నడిచాయి. సీట్ల కోసం ప్రయాణికులు సర్కర్ ఫీట్లు చేశారు. కర్నూలు కొత్త బస్టాండ్‌లో ఉదయం నుంచే ప్రారంభమైన రద్దీ సాయంత్రానికి తీవ్రమైంది. సీట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. హైదరా'బ్యాడ్' ప్రయాణం: రోడ్డు రవాణ సంస్థ కర్నూలు రీజియన్ ప్రత్యేక బస్సులు నడిపినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, బెంగుళూరు, చెన్నై, నెల్లూరు తదితర ప్రాంతాలకు తీవ్ర రద్దీ నెలకొంది. 'స్పెషల్' బస్సుల్లో చార్జీలపై 50శాతం అదనంగా వసూలు చేయడంతో ప్రయాణికుల జేబులు గులయ్యాయి. కర్నూలు నుంచి అనంతపురం, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె తదితర రూట్లలో బస్సులు చాలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఇక్కట్లపాలయ్యారు. రైల్వేస్టేషన్ కిటకిట: కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. ఇక్కడి నుంచి సికింద్రాబాదు (హైదరాబాదు)కు మధ్యాహ్నం 3గంటలకు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఉండడంతో ఒంటి గంట నుంచే 1వ నంబరు ప్లాట్‌ఫాం కిక్కిరిసింది. మూడు కౌంటర్లు ఏర్పాటు టికెట్లు ఇచ్చినా రద్దీ తగ్గలేదు. రైలు నిండిపోయి బయలుదేరే సమయానికి కనీసం నిల్చునే స్థలం లేక వెయ్యి మంది వెనక్కి తిరిగారు. ఈరైలు సీటింగ్ కెపాటిసీ 1800 మందికాగా ..బుధవారం నాలుగు వేల మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని బోగీలతోపాటు లగేజీ పెట్టే కూడా ప్రయాణికులతోనే నిండిపోయింది. -
లంక పయనం ఎటు?
-
లంక పయనం ఎటు?
మైకుల రొద...ఫ్లెక్సీల ఆర్భాటం...జాతరను తలపించే ఊరేగింపులు దాదాపు లేకుండా సాగిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసి సోమవారం పోలింగ్ జరగబోతోంది. ప్రచారార్భాటం లేకపోవడంవల్ల సాధారణ ఓటరు నాడిని పసిగట్టడం కష్టమైందన్న కొందరు పరిశీలకుల మాటల సంగతలా ఉంచి... గత ఎన్నికల్లో ఖర్చు రాసేసిన మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషిస్తాడేమోనన్న గుబులు అందరినీ పట్టిపీడిస్తోంది. పదేళ్లపాటు దేశాధ్యక్షుడిగా ఏలిన రాజపక్సకు ఏడు నెలలక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి సంభవించింది. అవినీతి, బంధుప్రీతివంటి ఆరోపణలతోపాటు టైగర్ల అణచివేత పేరిట లంక తమిళులపై సాగించిన దురంతాలు రాజపక్స ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. సరిగ్గా అదే సమయంలో ఆయన కేబినెట్లో ఆరోగ్యమంత్రిగా ఉన్న మైత్రిపాల సిరిసేన హఠాత్తుగా రాజీనామా చేసి విపక్ష శిబిరంలో చేరి అధ్యక్ష పదవికి పోటీచేసి విజయం సాధించారు. ఆ ఓటమితో తెరమరుగైన రాజపక్స ఇక అవినీతి కేసుల్లో, మానవ హక్కుల ఉల్లంఘన నేరారోపణల్లో కటకటాలు లెక్కించాల్సి వస్తుందని అందరూ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. అనూహ్యంగా ఆయన అధికార శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) నేతృత్వంలోని యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్(యూపీఎఫ్ఏ) అభ్యర్థిగా రంగం మీదికొచ్చారు. ఆయన ప్రత్యర్థిగా యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నాయకత్వంలోని యునెటైడ్ నేషనల్ ఫ్రంట్ ఫర్ గుడ్ గవర్నెన్స్(యూఎన్ఎఫ్జీజీ) అభ్యర్థి రణిల్ విక్రంసింఘే తలపడుతున్నారు. విక్రంసింఘే ప్రస్తుతం ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న సింహళుల్లో ఈసారి రాజపక్సపై సానుభూతి ఉన్నదని జూలై నెలాఖరున సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్(సీపీఏ) నిర్వహించిన సర్వే తేల్చడం ఒక్కటే ఆయనకు ఆశలు కల్పిస్తోంది. ఆ సర్వే ఫలితం వెల్లడయ్యాక తమ కూటమికి 117 స్థానాలు ఖాయమని రాజపక్స చెప్పుకున్నారు. ఏడు నెలలక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సింహళ ఓటర్లు చీలి రాజపక్సకు ఎదురుతిరిగారు. తాను ఓటమిపాలైతే మరోసారి తమిళ టైగర్లు విజృంభిస్తారని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. అయితే, ఈసారి మాత్రం సింహళులను మచ్చిక చేసుకోగలిగానని రాజపక్స విశ్వసిస్తున్నారు. లంక రాజకీయాలు చిత్రమైనవి. శ్రీలంక ఫ్రీడం పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న రాజపక్సను ధిక్కరించి బయటికొచ్చిన సిరిసేనను విపక్షాలన్నీ ఏకమై గెలిపిస్తే ఆయన మళ్లీ ఫ్రీడం పార్టీలోనే చేరి ఆ పార్టీ అధ్యక్ష పదవితోపాటు దాని నేతృత్వంలోని కూటమి అధినేతగా కూడా ఎన్నికయ్యారు. తాను అధ్యక్షుడ య్యేందుకు సహకరించిన విపక్ష యూఎన్‌పీ నేత రణిల్ విక్రం సింఘేకు సిరిసేన ప్రధాని పదవిని కట్టబెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజపక్సకు పార్టీ అభ్యర్థిత్వం రానీయరాదని ఎంత ప్రయత్నించినా సిరిసేన కృతకృత్యులు కాలేకపోయారు. అయితే, రాజపక్స ఎంపీ అయితే కావచ్చునేమో గానీ... ప్రధానిగా మాత్రం ఛాన్సివ్వబోనని సిరిసేన కుండ బద్దలు కొడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరు నియమిస్తే వారే ప్రధాని అవుతారని ఆయన గుర్తు చేస్తున్నారు. కనుక ఎంపీగా నెగ్గినా ప్రధాని పదవి వస్తుందన్న గ్యారెంటీ రాజపక్సకు లేదు. తర్వాత ఏమైతే కానీ...ముందు ఎంపీగా నెగ్గి తీరాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకే సింహళులు అధికంగా ఉండే కురునేగల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ సైనిక కుటుంబాలు అధికం గనుక తన గెలుపు ఖాయమన్న విశ్వాసంతో ఆయన ఉన్నారు. రాజపక్స అధికారంలో ఉండగా సాగిన లంక తమిళుల ఊచకోతలో సైన్యానిదే ప్రధాన పాత్ర అన్న సంగతిని గుర్తుంచుకుంటే రాజపక్స ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలోని ఆంతర్యం వెల్లడవుతుంది. సిరిసేన అధ్యక్షుడయ్యాక ఈ ఏడు నెలల పాలన అత్యద్భుతమని అంటున్నవారితోపాటే పెదవి విరుస్తున్నవారూ ఉన్నారు. ఆయన నియమించిన విక్రంసింఘే ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయగలిగింది. అధ్యక్షుడూ, ప్రధాని వేర్వేరు పార్టీలకు చెందినవారైనా సమన్వయం బాగుంది. రాజపక్స హయాంలో రద్దయిన హక్కులను పునరుద్ధరించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘానికుండే అధికారాలను పునరుద్ధరించారు. అందువల్లనే ఈసారి ఎన్నికల్లో విచ్చలవిడిగా ఫ్లెక్సీల ఏర్పాటు, సామాన్య జనజీవితానికి ఆటంకం కలిగే ర్యాలీలు వగైరా లేవు. పార్టీలన్నీ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసుకున్నాయి. చాలామందికి అసలు దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరు గుతున్నాయా, లేదా అని అనుమానం కలిగేంత ప్రశాంతంగా ప్రచారం సాగింది. కానీ, అదే సమయంలో అవినీతి చీడ ఈ ప్రభుత్వాన్నీ వదల్లేదు. వివిధ పథకాల అమలులో అవినీతి చోటు చేసుకుంటున్నదని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న హామీ ఇంకా నెరవేరలేదు. అయితే ఎంతో పరిమితంగా నైనాసాగుతున్న ఈ సంస్కరణలన్నిటికీ రాజపక్స తిరిగొస్తే బ్రేకు పడుతుందని లంకలోని ఉదారవాదులు ఆందోళన పడుతున్నారు. అధ్యక్ష పదవిలో ఉండగా రాజ్యాంగాన్ని ఇష్టానుసారం సవరించి రాజపక్స అపరిమిత అధికారాలను పొందారు. సిరిసేన అధ్యక్షుడయ్యాక ఇదంతా మారింది. ప్రధానిగా ఉండేవారికే ఎక్కువ అధికారాలుండేలా మొన్న ఏప్రిల్‌లో రాజ్యాంగాన్ని సవరించారు. ఇలాంటి సమయంలో మళ్లీ రాజపక్స ప్రధాని కావడం ప్రమాదకరమన్న భావన అందరిలోనూ ఉంది. శ్రీలంక అంత త్వరగా గతాన్ని మరువదని, కళ్ల ముందటి వాస్తవాన్ని గుర్తించకపోదని...కనుక రాజపక్స విజయం అసాధ్యమని అలాంటివారి విశ్వాసం. లంక ఓటరు మొగ్గు ఎటువైపో చూడాల్సి ఉంది.