మనం ఏదైనా పెళ్లి లేదా పెద్దపెద్ద ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మనతో పాటు విలువైన వస్తువులు అంటే.. బంగారు ఆభరణాలు, విలువైన గాడ్జెట్స్ తీసుకువెళుతుంటాం. ఇటువంటి వేడుల సందర్భంలో బంధువుల సందోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనతోపాటు తీసుకువచ్చిన విలువైన సామాను చోరీ జరిగే అవకాశం ఉండవచ్చు. అలాగని ప్రతి నిముషం మన విలువైన వస్తువులను కంట కనిపెట్టుకుని ఉండలేం. పైగా ఇటువంటి సందర్భాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరిపైనా నిందలు కూడా వేయలేం. మరి దీనికి పరిష్కారం ఏమిటి?
ఫ్లైట్ అటెండెంట్ సలహా..
ఫ్లైట్ అటెండెంట్ మైగుల్ మనోజ్ ఇటీవల సోషల్ మీడియాలో..విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు ఒక ఆశ్చర్యకరమైన లైఫ్ హ్యాక్ తెలియజేశారు. ఇది అందరికీ ఎంతగానో ఉపకరిస్తుంది. మన దగ్గరున్న విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ఖాళీ చిప్స్ ప్యాకెట్స్ మన దగ్గర ఉంచుకోవాలని అయన సలహా ఇచ్చారు. నిజానికి మనం ఖాళీ చిప్స్ ప్యాకెట్లను చెత్తగా భావించి, బయటపారవేస్తుంటాం. అయితే విలువైన వస్తువులను ఎవరూ గుర్తించలేని చోట పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.
చిప్స్ ప్యాకెట్‌తో పనేంటి?
తాను చిప్స్ ప్యాకెట్ లైఫ్ హ్యాక్‌ను ఫాలో చేస్తానని చెప్పిన ఆయన.. తాను ఏదైనా హోటల్‌లో బస చేసినప్పుడు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో విలువైన వస్తువులను దాచివుంచుతానన్నారు. దీంతో ఎవరూ కూడా విలువైన వస్తువులు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో ఉంటాయనే విషయాన్ని అంచనా వేయలేరన్నారు. సాధారణంగా చోరీకి పాల్పడేవారు అల్మరాలు, సూట్‌కేసులు, బ్యాగులను, పర్సులను గమనించి వాటిని తస్కరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా విలువైన వస్తువులు అక్కడే ఉంటాయనే భావనతో చోరులు వాటిపై కన్ను వేస్తారు.
దొంగకు దిమ్మతిరిగిపోయేలా..
ప్రయాణ సమయంలో లేదా వేడుకల సందర్భంలో ఖాళీ చిప్స్ ప్యాకెట్ లేదా ఖాళీ టిన్‌లలో విలువైన వస్తువులను ఉంచితే దొంగలు వాటిని పసిగట్టలేరు. ఫలితంగా మన విలువైన సామాను సురక్షితంగా ఉంటుంది. కాగా మైగుల్ మనోజ్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఈ సలహా చాలామందికి నచ్చలేదు. విలువైన వస్తువులను మనం ధరించే దుస్తులలోని సీక్రెట్ పాకెట్లు, ధార్మిక గ్రంథాలు, ఖాళీ కాస్మొటిక్ డబ్బాలలో ఉంచడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్‌అవుట్ ప్లాన్..
విలువైన వస్తువులను ఖాళీ చిప్స్ ప్యాకెట్‌లో పెడితే.. ఫ్లైట్ అటెండెంట్ సలహా!
Published Mon, Jul 3 2023 11:48 AM | Last Updated on Mon, Jul 3 2023 12:03 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment