
కేసముద్రం(కేసముద్రం) : భార్య మృతిచెందగా ఓ వృద్ధుడు, భర్త మృతితో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉండలేక ఒక్కట య్యారు.. ఓ ఆలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కేసముద్రం మండలం వెంకటగిరి శివారు చంద్రుతండాకు చెందిన బీల్యానాయక్ అనే 75 ఏళ్ల వృద్ధుడికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా రెండేళ్ల క్రితం భార్య జాంకి అనారోగ్యంతో మృతిచెందింది.
అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు తండాకు చెందిన బుజ్జి అనే 52 ఏళ్ల వృద్ధురాలుకు ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. బుజ్జి భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమె కూడా ఒంటరిగా ఉంటోంది. తోడు కోసం మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బిల్యా కొందరి ద్వారా బుజ్జి గురించి తెలుసుకున్నాడు. ఒకరికొకరు తోడు కోసం పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో కేసముద్రం మండలకేంద్రంలోని రామాలయానికి వెళ్లి దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న వృద్ధులు
Comments
Please login to add a commentAdd a comment