సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: ‘ఓటు బ్యాంకు కోసం కాదు. నయా భారత్ కోసమే సంస్కరణలు చేపడుతున్నాం. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రయతి్నస్తున్నాం’అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేదల ఆరోగ్యం కోసమే ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టామని అన్నా రు. ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించిందని చెప్పారు. మెడికల్, టెక్నికల్ విద్యను మాతృభాషలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో మంగళవారం జరిగిన ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’కార్యక్రమానికి అనుసంధానంగా తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ లబి్ధదారులతో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ పరిశోధనా క్షేత్రంలో వర్చువల్‌గా కార్యక్రమం జరిగింది.
3 వేల మంది లబి్ధదారులతో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని వర్చువల్ పద్ధతిలో మోదీ విడుదల చేశారు. రైతుల ఖాతా ల్లోకి నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉం డాల్సిందేనని.. దీంతో ప్రజలకు మేలు జరుగుతుందని, అవి నీతి తగ్గుతుందని చెప్పారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయమని, సర్జికల్ స్ట్రైక్ చేయడం పట్ల గర్వపడుతున్నా మని చెప్పారు.భారత స్టార్టప్‌లపై చర్చ జరుగుతోందన్నారు.
ధాన్యం సేకరణకు రూ. 26,600 కోట్ల ఖర్చు: కిషన్‌రెడ్డి
10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లను ఏకకాలంలో జమ చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎరు వుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఎరువుల దుకాణాల వద్ద క్యూ కట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నా రు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ. 4 లక్షల కోట్ల వరకు పెంచామన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గతంలో కొన్ని రకమైన పంటలకు మాత్రమే మద్దతు ధర ఉండేదని, నేడు 23 రకాల పంటలకు ఇస్తున్నామని చెప్పారు. భూ రికార్డుల ఆధునీకరణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నా రు. నానో యూరియా దిగుబడి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 2014లో రూ. 3,400 కోట్లను ఖర్చు చేస్తే ప్రస్తుతం రూ. 26,600 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు.
రామగుండం ఫ్యాక్టరీని కేసీఆర్ అడ్డుకుంటున్నారు
రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉందని, ప్రారంభమైతే బీజేపీ నేతలకు పేరొస్తుందని కాలుష్యం పేరుతో ఫ్యాక్టరీకి నోటీసులిప్పించి అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అందనివ్వట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. కేసీఆర్ ఎన్ని రోజులు ఫామ్ హౌస్‌లో ఉంటారో.. ఎన్ని రోజులు ప్రగతి భవన్‌లో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ‘డబ్బా ఇల్లు వద్దన్నారు. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారు’అని రాష్ట్ర సర్కారును ప్రశ్నించారు. పేదల కోసం ఎన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికైనా రాష్ట్రానికి నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment