'అందరూ నన్ను వెక్కిరించేవారు' | walk on World Handicapped people Day | Sakshi
Sakshi News home page

'అందరూ నన్ను వెక్కిరించేవారు'

Published Sat, Dec 2 2017 1:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

walk on World Handicapped people Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వికలాంగుల దినోత్సవం(డిసెంబర్‌ 3) సందర్భంగా శనివారం నక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం అవగాహన సదస్సు, వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హీరో రాజశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' నేను వికలాంగుడినే.. నాకు నత్తి ఉండేది.. మా నాన్న పేరు సరిగ్గా పలకడం వచ్చేది కాదు. అందరూ హేళన చేసేవారు.

అయినా పట్టుదలతో డాక్టర్‌ అయ్యాను.. ఆ తర్వాత మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాను. మనం అంతా సమానం అనే భావన ఉండాలి. దివ్యాంగులు నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ముందుకు వెళ్లాలి. నా జీవితాంతం వికలాంగుల కోసం సహాయ పడుతా'  అని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement