వైరా: పుట్టుకతో వికలాంగుడు.. అయినా పింఛన్ మంజూరు కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన మెండెం ప్రవీణ్‌కుమార్ (22) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ పుట్టుకతో ఎడమకాలు పని చేయదు. తనకు వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని పలుమార్లు అధికారుల చుట్టు తిరిగాడు. ఎమ్మెల్యేకు సైతం వినతిపత్రం ఇచ్చినా ఫలితం దక్కలేదు. తండ్రి ఆర్టీసీ కండక్టర్ కావడంతో అధికారులు పింఛన్ మంజూరు చేయలేదు.
ఇటీవలే తండ్రి గాబ్రేయిల్ సర్వీసు నుంచి రిమూవల్ అయ్యాడు. దీంతో పరిస్థితిని వివరిస్తూ మరోసారి దరఖాస్తు చేసుకున్నా.. పింఛన్ మంజూరు కాలేదు. దీంతో ప్రవీణ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. కాగా, శుక్రవారం ప్రవీణ్‌కుమార్ పుట్టినరోజును స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ జరుపుకున్నాడు. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ప్రవీణ్‌కుమార్ బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో శవమై కనిపించాడు. పింఛన్ మంజూరు కాలేదన్న మనోవేదనతోనే ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
పుట్టిన రోజు నాడే బలవన్మరణం
Published Sun, Sep 20 2015 2:14 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement