రామ్‌నాథ్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ , సీఐ, మృతుడి భార్యను విచారిస్తున్న డీఎస్పీ
చిత్తూరు, మదనపల్లె క్రైం: మదనపల్లెలో శనివారం వేకువజామున అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందా డు. డీఎస్పీ చిదానందరెడ్డి, టూటౌన్ సీఐ సురేష్‌కుమార్, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తం బళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె పంచాయతీ తిమ్మయ్యగారిపల్లెకు చెందిన నరసింహులు, నరసమ్మ కుమారుడు రామ్‌నాథ్ (30) వికలాంగుడు. ఇతనికి రాజంపేట, గరుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెం దిన ఏఎన్‌ఎం లక్ష్మీతో వివాహమైంది. వీరు మదనపల్లె పట్టణం గొల్లపల్లెమిట్టలోని విజయనగర కాలనీలోని సొంత ఇంటిలో ఉంటున్నారు. రామ్‌నాథ్ మల్లికార్జున సర్కిల్‌లో ఉంటున్న ఓ ఇంజినీర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను శనివారం వేకువజామున మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి భార్యను విచారించారు.
దొంగలను చూసి..
తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తన భర్త బాత్ రూమ్‌కు వెళ్లేందుకు తలుపు తీశారని, ఆ సమయంలో ఐదుగురు ముసుగు దొంగలు ఇంటిలోకి చొరబడ్డారని భార్య లక్ష్మి తెలిపింది. వారిని చూసి తన భర్త గుండె ఆగి చనిపోయాడని పేర్కొంది.తనను చంపుతామని బెదిరించడంతో మిన్నకుండిపోవాల్సి వచ్చిందని తెలిపింది. దొంగలు బీరువా తెరిచి రూ.5 వేల నగదు, భర్త మెడలోని బంగారు చైను, తన మెడలోని మరో బంగారు చైను అపహరించారని వివరించింది. అక్కడి పరిస్థితులను బట్టి ఇది పతకం ప్రకారం జరిగిన హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తెల్లవారే సమయంలో దొంగలు ఇంటిలోకి చొరబడే ప్రసక్తే ఉండదని, అందులోనూ పేదలు ఎక్కువగా ఉంటున్న ఏరియా కావడంతో దొంగలు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. అలాగే మృతుడి గొంతుపై కమిలిన గాయాలు ఉన్నాయని పేర్కొ న్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లొ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత రామ్‌నాథ్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment