బాలికపై అత్యాచారయత్నం | rape attempt on girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం

Published Sat, May 6 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

rape attempt on girl

పగిడ్యాల:  ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.  గ్రామంలో ఓ ఆర్‌ఎంపీ వద్ద ఓ యువకుడు శిక్షణ పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన దివ్యాంగ బాలికను క్లీనిక్‌లో కసువు కొట్టడానికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం బాలిక శుక్రవారం కుటుంబీకులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. క్లీనిక్‌లో జరిగిన సంఘటనపై ఆర్‌ఎంపీని విలేకరులు ప్రశ్నించగా అలాంటేదేమి జరుగలేదన్నారు. అయితే బాధిత బాలిక మాత్రం తనపై రెండు పర్యాయాలు బలాత్కారానికి పాల్పడ్డాడని విలేకరులకు చెబుతోంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్‌ఐ బాలనరసింహులును వివరణ కోరగా ఇంత వరకు తమ దృష్టికి రాలేదని,  బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement