26 నుంచి వికలత్వ నిర్ధారణ పరీక్షలు
Published Sat, Sep 17 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని వికలాంగులకు ఈనెల 26వ తేదీ నుంచి వికలత్వ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరమ్ సర్టిఫికెట్ కాలపరిమితి పూర్తయిన వారు కూడా ఈ పరీక్షలకు హాజరు కావాలని కోరారు. 26న అలంపూర్, గద్వాల నియోజకవర్గాల వారికి, 27న అచ్చంపేట, నాగర్‌కర్నూల్, 28న దేవరకద్ర, మహబూబ్‌నగర్, 29న జడ్చర్ల, షాద్‌నగర్, 30 కోడంగల్, నారాయణపేట్, వచ్చే నెల 1వ తేదీన కల్వకుర్తి, కొల్లాపూర్, 3న వనపర్తి, మఖ్తల్ నియోజకవర్గాల్లో ఉన్న వారు హాజరు కావాలని కోరారు. శారీకర వికలాంగులకు(అంధులు, మూగ, చెవుడు) జిల్లా ఆస్పత్రిలో, మానసిక వికలాంగులుకు ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో వికలత్వ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. హాజరుకాని వారికి మరో అవకాశంగా వచ్చే నెల 4, 5 తేదీల్లో హాజరు కావచ్చని పేర్కొన్నారు.
Advertisement
Advertisement