
నల్లగొండ: తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడానికి చెందిన కొత్త రమేష్‌గౌడ్ తాటిచెట్టుపై నుంచి కింద పడడంతో రెండు కాళ్లు విరిగాయి. దీంతో భార్యే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యింది. తనకున్న మూడెకరాల భూమి పక్కన ఉన్న పొలం రైతు మరో బోరు వేశాడు. దీంతో తన బోరు వట్టిపోయి పొలం ఎండిపోయింది. దీనికి ఆర్థికభారం తోడుకావడంతో తిప్పర్తి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని రమేష్ తెలిపాడు. దీంతో లక్ష్మి తన భర్తను మంచంపై పడుకోబెట్టి ముగ్గురు కూతుళ్లతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చింది. న్యాయం చేయాలని డీఆర్‌ఓ కీమ్యానాయక్‌కు వినతిపత్రం అందజేసింది. – కంది భజరంగ్‌ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ