స్పూర్తిని రగిలించే వీడియో ఇది | VVS Laxman Shares Heart Touching Video On Twitter | Sakshi
Sakshi News home page

సంకల్పం ముందు ఓడిన వైకల్యం

Published Sun, May 24 2020 11:55 AM | Last Updated on Sun, May 24 2020 11:59 AM

VVS Laxman Shares Heart Touching Video On Twitter - Sakshi

క్రికెట్‌ ఆడాలన్న గట్టి సంకల్పం ముందు అతడికున్న వైకల్యం ఓడిపోయింది. అకుంటిత దీక్ష, పట్టుదల, ధైర్యంతో మైదానంలోకి దిగాడు.. అనుకున్నది సాదించాడు.. అందరిలోనూ స్పూర్తి రగిలించాడు. రెండు చేతుల సరిగా లేక అంగవైకల్యం గల ఓ పిల్లాడు బౌలింగ్‌ చేయడం టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను  ఆకట్టుకుంది. దీంతో వెంటనే ఆ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘మానవునికున్న ఆత్మ స్తైర్యం, పట్టుదల, ధైర్యాన్ని ఎవరూ దొంగలించలేరు. మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్‌’ అంటూ లక్ష్మణ్‌ కామెంట్‌ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

చదవండి:
మా ఇద్దరిదీ ఒకే స్వభావం.. ఎందుకంటే
‘అవే గంభీర్‌ కొంప ముంచాయి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement