ఎస్‌వీఎన్‌కాలని (గుంటూరు) : తనకు కేటాయిస్తానన్న ఉద్యోగంపై ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పొన్నూరు మండల కేంద్రానికి చెందిన ఓ దివ్యాంగురాలు గుంటూరులోని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాల యం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసు కుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. వివరాలిలా ఉన్నాయి. పొన్నూరుకు చెందిన దివ్యాంగురాలు కె.మాధవికి పుట్టుకతోనే అంగవైకల్యం. అయినా, విధిని ఎదురించి పోరాడి పదో తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తి చేసింది. తన వంతుగా దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పోరా టాలు చేసింది. ఇరవై ఏళ్లుగా దివ్యాంగుల పోరాటాల్లో పాల్గొంటూ వస్తోంది. అయితే రిజర్వేషన్ కోటాలో వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఆమె గతేడాది దరఖాస్తు చేసుకుంది. తనకు పోస్టు కేటా యింపు కోసం సదరు కార్యాలయానికి కాళ్లరిగేలా తిరిగింది.
అయితే వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ రావాలనే నెపంతో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రఘురామయ్య తనకు పోస్టు కేటాయింపులో తాత్సా రం చేస్తూ వచ్చారు. దీంతో ఆమె గత పది నెలలుగా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద స్వచ్ఛందంగా సేవలను అందిస్తూ వస్తోంది. అయితే, ఆర్నెల్ల క్రితం రిజర్వ్ కోటాలోని పోస్టును వేరే వ్యక్తికి అప్పగించారని, తనకు మాత్రం తీరని అన్యాయం చేశారని బాధితురాలు వాపోయింది. ప్రస్తుత ఏడీ రఘురామయ్య బుధవారంతో ఇన్‌చార్జి ఏడీ పోస్టు నుంచి వైదొలగనున్నారని, ఆ స్థానంలో కొత్త ఏడీ నియమితులవుతున్నారని ఆమె తెలిపింది. ఈ క్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు.. ప్రస్తుత ఏడీ రఘురామయ్యకు తన పోస్టు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని, అయినా ఏడీ మాత్రం తనకు ఇచ్చేం దుకు ససేమిరా అంటున్నారంటూ వాపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు వివరించింది. విషయం తెలుసుకున్న ఏడీ రఘురామయ్య బాధితురాలు మాధవితో ఫోన్‌లో సంభాషించి బుధవారం ఔట్ సోర్సింగ్ పోస్టు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తానని హామీ ఇచ్చారని ఆమె తెలిపింది. విషయం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి పొన్నూరు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment