జగన్‌కు ఘన స్వాగతం | Welcome to the ys jagan | Sakshi
Sakshi News home page

జగన్‌కు ఘన స్వాగతం

Published Tue, Nov 24 2015 2:13 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్‌కు ఘన స్వాగతం - Sakshi

జగన్‌కు ఘన స్వాగతం

రేణిగుంట: వైఎస్సార్ సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో రేణిగుంట న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కార్యకర్తలు, ప్రజలతో నిం డిపోయింది. టెర్మినల్ బయట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది యువకులు ప్ల కార్డులతో ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కడప, చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన ఉదయం 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, బి య్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మాజీఎమ్మెల్యే గాంధీ, నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సి ద్ధారెడ్డి, పుల్లూరు అమరనాథరెడ్డి, ఆంజనేయులు, వి రూపాక్షి జయచంద్రారెడ్డి, అత్తూరు త్రివిక్రమ్, సిరాజ్, శ్రీకాంత్ రాయల్, బాల, మహిళా విభాగం నాయకురా లు మమత, తిరుపతి, శ్రీకాళహస్తికి చెందిన నాయకు లు స్వాగతం పలికారు. రిజర్వుడు లాంజ్‌లో 10 నిమిషాలు పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ మోహన్‌రెడ్డి ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో రైల్వే కోడూరుకు బయలుదేరారు.

 మహిళల కన్నీరు తుడిచిన జగన్
 భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి తడిసి ముద్దవుతున్నా తమను అధికారులు పట్టించుకోవడం లేదని కరకంబా డి పంచాయతీ రాజీవ్‌గాంధీకాలనీ మహిళలు వైఎస్సా ర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కంటతడి పెట్టారు. రైల్వేకోడూరు పర్యటన నిమిత్తం రోడ్డు మా ర్గాన వెళుతున్న ఆయనకు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కరకంబాడి వద్ద స్వా గతం పలికారు. రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన మహిళ లు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని, తమ బాధలు చె ప్పుకుని బోరుమన్నారు. 30 ఏళ్లకు ముందు కట్టించిన ఇళ్ల పెచ్చులు ఊడి ఉరుస్తున్నాయని సమస్యలు ఏకరు వు పెట్టారు. స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి కన్నీళ్లు తుడిచారు. సమస్యను పరిష్కరించే బాధ్యతను శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ బియ్యపు మధుసూదన్‌రెడ్డికి అప్పగించారు. అధికారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ అత్తూరు సర్పంచ్ హరినాథ్ యాదవ్, నాయకులు గంగారి రమేష్, గురవరాజపల్లె శంకర్‌రెడ్డి, ఆవుల మురళి, గురునాథం యాదవ్ గ్రామ పెద్దలు రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement