
రేపు రేణిగుంటకు వైఎస్ జగన్
చిత్తూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రేణిగుంటకు రానున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బబ్బల రాజారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావడానికి జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట మీదుగా వెళ్లనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూళ్లూరుపేటకు వెళతారని పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందింది.