సాక్షి సిబ్బంది నుంచి రూ. 32 లక్షలు దోపిడీ | 32 lakhs rupees robbed from sakhi staff in Renigunta | Sakshi
Sakshi News home page

సాక్షి సిబ్బంది నుంచి రూ. 32 లక్షలు దోపిడీ

Published Sat, Sep 13 2014 1:47 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

సాక్షి సిబ్బంది నుంచి రూ. 32 లక్షలు దోపిడీ - Sakshi

సాక్షి సిబ్బంది నుంచి రూ. 32 లక్షలు దోపిడీ

హైదరాబాద్:  చిత్తూరు జిల్లా రేణిగుంటలో శనివారం సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. దుండగులు సాక్షి దిన పత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి.

రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి డబ్బును బ్యాగ్లో తీసుకుని  ఎస్బీఐలో జమ చేయడానికి వెళ్లారు. సాక్షి సిబ్బంది వెళ్తున్న ద్విచక్ర వాహనాన్నిఓ స్కార్పియో ఫాలో చేసింది. దారి మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు తీసుకెళ్తున్న 32 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement