sakhi staff
-
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తొమ్మిదిమంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ మధ్యలో తీసిన ఫొటోలను పోటీలకు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 463 మంది 826 ఫొటోలను పంపించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, సోషల్ ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, సోషల్ హిస్టోరియన్ డాక్టర్ కొంపల్లి హెచ్.హెచ్.ఎస్.సుందర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి 75 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపికచేశారని అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (ఆగస్టు 18వ తేదీ) సందర్భంగా విజేతలకు గురువారం విజయవాడలో ‘ప్లాటినం జూబ్లీ ఇమేజ్ అవార్డులు’ ఇవ్వనున్నట్లు చెప్పారు. 75 చిత్రాలతో ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేసి, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అవార్డులు పొందిన సాక్షి ఫోటోగ్రాఫర్లు: వి.రూబెన్ బెసాలియల్ (విజయవాడ), ఎన్.కిషోర్ (విజయవాడ), ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ), పి.ఎల్. మోహనరావు (వైజాగ్), ఎండీ నవాజ్ (వైజాగ్), వడ్డే శ్రీనివాసులు (కర్నూలు), కె.మోహనకృష్ణ (తిరుపతి), మహబూబ్ బాషా (అనంతపురం), శివ కొల్లోజు (తెలంగాణ). ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
సాక్షి ప్రతినిధిపై మంత్రి సోమిరెడ్డి చిందులు
-
ఒంటరి మహిళలకు ‘సఖి’ అండ
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని ఒంటరి మహిళలకు సఖి కార్యక్రమం అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి జి.శంకరాచారి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు ‘సఖి’ సేవల గురించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలను, యువతులను ఆకతాయిలు, పోకిరీల నుంచి కాపాడడం కోసం సఖీ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. ఎవరు వేధింపులకు పాల్పడినా 181కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం అధికారి మంజుల, ప్రశాంతి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి.రాములుయాదవ్, ఆటోడ్రైవర్లు గోపాల్, ఎండీ మహబూబ్ అలీ, మహేష్‌కుమార్, ఎండీ ఫజిల్, ఎండీ రుక్నోద్దీన్, యాదగిరి, వెంకట్రాములు పాల్గొన్నారు. -
సాక్షి సిబ్బంది నుంచి రూ. 32 లక్షలు దోపిడీ
హైదరాబాద్: చిత్తూరు జిల్లా రేణిగుంటలో శనివారం సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. దుండగులు సాక్షి దిన పత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి. రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి డబ్బును బ్యాగ్‌లో తీసుకుని ఎస్బీఐలో జమ చేయడానికి వెళ్లారు. సాక్షి సిబ్బంది వెళ్తున్న ద్విచక్ర వాహనాన్నిఓ స్కార్పియో ఫాలో చేసింది. దారి మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు తీసుకెళ్తున్న 32 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.