కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ తగిలింది. తిరుపతి వచ్చిన ఆయనను బుధవారం రేణిగుంట చెక్పోస్ట్ సర్కిల్ వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజన ద్రోహి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో జైరాం రమేష్ తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. తెలంగాణపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యుడుగా ఉన్న జైరాం రమేష్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.