రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
తిరుపతి: యువభేరి కార్యక్రమానికి బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సంజీవయ్య, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వైఎస్ జగన్ నెల్లూరుకు బయలుదేరారు.
అనంతరం రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు వెళ్తున్న వైఎస్ జగన్ను.. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహాస్తి, తొట్టంబేడు రైతులు కలిశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటుందని రైతులు ప్రతిపక్షనేత వద్ద తమ గోడు చెప్పుకున్నారు. రైతులకు ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరులో జరగనున్న ‘యువభేరి’ కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.