రేణిగుంటలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం | YS Jagan To Reach Renigunta Railway Station At Tirupati | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం

Jan 10 2019 11:20 AM | Updated on Mar 20 2024 3:59 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎ‍స్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్‌ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్‌ నినాదాలతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్‌ అంటూ రైల్వేస్టేషన్‌లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement