రూ.20 కోట్లతో రేణిగుంటకు తెలుగు‘గంగ’
- 108 గ్రామాలకు పథకాన్ని అనుసంధానం చేస్తూ రూపకల్పన
- డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలనే దృఢ సంకల్పం
- రెండు రోజుల క్రితం ప్రారంభమైన పనులు
చిత్తూరు(టౌన్): రాష్ర్ట ప్రభుత్వం రూ.20 కోట్ల తో రేణిగుంటకు రూ.20 కోట్లతో తెలుగుగంగ పథకాన్ని మంజూరు చేసింది. శ్రీకాళహస్తి నియో జకవర్గంలోని రేణిగుంట, దాని పరిసరాల్లో ఉన్న 108 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. రేణిగుంటలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో పాటు అధికంగా కుటుంబాలు నివసిస్తుండడం తో వారంతా తాగునీటికి ఇబ్బంది పడుతున్నా రు.
రక్షిత మంచినీటి పథకాల బోర్లలో నీటిమట్టం అడుగంటిపోవడంతో తాగునీటి సమ స్య తీవ్రంగా ఉంది. దాంతో తాత్కాలిక ఉపశమనం కోసం జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, వాటి పరిధిలోని పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే నీరు అవసమని గుర్తించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి రేణిగుంటకు ప్రత్యేకంగా తాగునీటి పథకాన్ని మంజూరు చేయించుకున్నారు.
20 ఎంఎల్‌డీ కెపాసిటీతో...
20 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) కెపాసిటీతో ఈ తాగునీటి పథకాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూపకల్పన చేశారు. దీని పనులను డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలనే దృఢసంకల్పంతో మంత్రి ఉన్నారు. ఆ మేరకు చర్య లు చేపట్టాలని అధికారులను మంత్రి బొజ్జల ఆదేశించడంతో రెండు రోజుల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు గురువారం రేణిగుంటకు వె ళ్లి పనులను పరిశీలించారు.
రేణిగుంటలో నివాసం ఉం టున్న కుటుంబాలతో పాటు పరిశ్రమలకు రోజు కు 6 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పథకం ద్వారా వచ్చే 20 ఎంఎల్‌డీలో 6 ఎంఎల్‌డీ రేణిగుంటకు అందిస్తే మిగిలిన 14 ఎంఎల్‌డీ నీటిని పక్కనున్న 108 గ్రామాలకు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
పంపింగ్, లిఫ్టింగ్ ఆధారంగానే..
ఈ పథకం పూర్తిగా పంపింగ్, లిఫ్టింగ్‌ల ఆధారంగానే పనిచేస్తుంది. తెలుగుగంగ -చెన్నై మెయిన్ కెనాల్ నుంచి లిఫ్టింగ్ ద్వారా నీటిని రేణిగుంటకు తీసుకొస్తారు. ఆ తర్వాత పంపింగ్‌తో ఓవర్‌హెడ్ ట్యాంకులను నింపి గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. పంపింగ్, లిఫ్టింగ్‌లకు ప్రత్యేకంగా విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. అయితే స్వల్పకాలిక టెండర్ల పద్ధతిలో వీటిని చేపట్టనున్నారు. ఈ పథకానికి నాలుగు నెలల సమయం ఉన్నా మూడు నెలలు మాత్రమే కాంట్రాక్టర్లకు గడువిచ్చి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయూలనే కృతనిశ్చయంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు.