safe drinking water schemes
-
నీరుగారుతున్న నిర్మాణం
విజయనగరం మున్సిపాలిటీ: పాలకులు మారినా..అధికారులు వచ్చి పోతున్నా..పట్టణ ప్రజల దాహార్తి మాత్రం తీరడం లేదు. జిల్లా కేంద్రంలో గల 3 లక్షల మంది ప్రజలు కొన్నేళ్లుగా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేకపోవడం దారుణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వాటిని వినియోగించుకోవడంలో ఇంజినీరింగ్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు ఆదిశగా ప్రయత్నాలు సాగించిన దాఖలాలు లేవు. దీంతో ఈఏడాదీ వేసవిలో పట్టణప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పనలవిగా మారాయి. మూడేళ్లుగా నిర్మాణంలో మూడు రక్షిత మంచి నీటి పథకాలు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న ప్రజల దాహర్తిని తీర్చేందుకు పట్టణంలోని వ్యాసనారాయణమెట్ట, ఫూల్భాగ్కాలనీ, మయూరి జంక్షన్ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణాలు చేపట్టాలని మూడేళ్ల క్రితమే నిర్ణయించారు. ఇందులో భాగంగా వ్యాసనారాయణమెట్ట, పూల్బాగ్కాలనీతో పాటు మయూరి జంక్షన్ వద్ద నిర్మించతలపెట్టిన నీటి పథకాలకు సుమారు రూ450కోట్లు నిధులు మంజూరు చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతూనే ఉంది. రూ.96 లక్షల వ్యయంతో వ్యాసనారాయణమెట్ట ప్రాంతం 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచి నీటి పథకం మార్చి నాటికి పూర్తివు తుందని అధికారులు చెబుతున్నారు. అయితే మయూరి జంక్షన్ తదితర ప్రాంతాల్లో నిర్మించాల్సిన రక్షిత మంచి నీటి పథకాలు మాత్రం విశాఖలో గల పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాయి. అయితే ముందుగా పనులు చేపట్టిన సదరు కాంట్రా క్టర్లు ట్యాంక్ నిర్మాణం మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు. దీంతో ఆ రెండు పథకాల నిర్మాణ ప్రగతి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా మారింది. కలగా మిగిలిపోతున్న ప్రతి రోజూ నీటి సరఫరా... పట్టణ ప్రాంతాలో నివసిస్తున్న ప్రజలు ప్రతి రోజు తాగు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకంటామని వచ్చే పాలకులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చటం లేదు. పట్టణంలో వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే సాధారణ రోజుల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంటుంది.ఈ మూడు రక్షిత మంచి నీటి పథకాల నుంచి 16 ఎంఎల్డి నీరు పట్టణానికి వస్తుంటుంది. ఇది కూడా నెల్లిమర్ల, రామతీర్ధం, ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకాల వద్ద నుంచి ఆశించిన స్థాయిలో నీరు పంపింగ్ జరిగినపుడే సాధ్యపడుతుందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వేసవి కాలంలో పట్టణానికి నీటిని అందించే మూడురక్షిత మంచి నీటి పథకాల వద్ద ఊటబావుల్లో నీటి మట్టాలు తగ్గిపోయే పరిస్థితిలు ఏటా చవి చూస్తున్నారు. దీంతో ఆ సమయంలో అధికారులు మూడు రోజులకు ఒక మారు నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా వేళపాళలేకుండా మండుటెండలో మిట్టమధ్యాహ్నం సమయాల్లో, అర్ధరాత్రి అంతా పడుకునే సమయాల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడుతూనే ఉన్నారు. ఇదే విషయమై మున్సిపల్ డీఈ మత్స్యరాజును సాక్షి వివరణ కోరగా..పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వ్యాసనారాయణమెట్ట రక్షిత మంచినీటి పథకం పనులు మార్చి నెలలోగా పూర్తవుతాయన్నారు. మిగిలిన పథకాలకు సంబంధించిన పనులును పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారని తమకు సంబంధం లేదన్నారు. వేసవిలో పట్టణ ప్రజల తాగు నీటిని తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించచామనని చెప్పారు. -
నీటి మూటలు !
జిల్లాలో తొమ్మిది వాటర్ గ్రిడ్లను నిర్మించి, నీటి ఎద్దడి తీర్చాలని భావిస్తున్న సర్కార్ వాస్తవ పరిస్థితులను విస్మరిస్తోంది. నీటి లభ్యత, నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిశీలిస్తే ఇది ఎంతవరకు సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి విభాగం నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం, భారీ ఖర్చుతో వాటర్ గ్రిడ్లను ఎలా నిర్మిస్తుందన్న సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యమయ్యే మార్గాలను కాలదన్ని, గాలిలో మేడలు కడుతున్నారని, జిల్లాలో నీటి లభ్యత, వాటర్ గ్రిడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలను పరిశీలిస్తే వాస్తవపరిస్థితులు అర్థమవుతాయని అభిప్రాయపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో 2945 హేబిటేషన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికీ జాతీయ గ్రామీణాభివృద్ధి మంచినీటి కార్యక్రమం నిబంధనల కింద ప్రతీ రోజూ 55 లీటర్లు అందజేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 1089 హేబిటేషన్లలో మాత్రమే రక్షిత మంచినీరు అందించగలుగుతున్నారు. మిగతా హేబిటేషన్ల విషయానికి వస్తే... 684 హేబిటేషన్లలో ఒక్కొక్కరికీ 30 నుంచి 40 లీటర్లు, 406 హేబిటేషన్లలో 20 నుంచి 30 లీటర్లు, 387 హేబిటేషన్లలో 10 నుంచి 20 లీటర్లు, 293 హేబిటేషన్లలో 10 లీటర్ల లోపే సమకూర్చగలుగుతున్నారు. 86 గ్రామాల్లో కనీసం లీటర్ రక్షిత మంచినీటిని కూడా అందించలేని పరిస్థితులున్నాయి. ఈ లెక్కన జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో 16 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో ఎనిమిది పథకాల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పదుల సంఖ్యలో మంజూరు దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కొంతమేర తాగునీటి సమస్య తీరుతుంది. ఈ పనులకు రూ.300 కోట్లు అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నిర్మాణ దశలో ప్రాజెక్టులకు నిధులు నిలిపేసింది. ప్రారంభం కాని పనుల్ని ఆపేయాలని ఆదేశాలిచ్చింది. మంజూరు దశలో ఉన్న వాటి ఊసెత్తడం లేదు. దీని కంతటికీ నిధుల సమస్యే కారణమని సర్కార్ పరోక్షంగా చెబుతోంది. ఈ మార్గాన్ని వదిలేసి సర్కార్ ప్రస్తుతం ఆచరణ సాధ్యం కాని వాటర్ గ్రిడ్లపై దృష్టి సారించింది. జిల్లాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రోజుకి 150 లీటర్ల చొప్పున, పరిశ్రమలకు 15 శాతం నీరందించేందుకు గాను రూ.3,750 కోట్లతో తొమ్మిది వాటర్ గ్రిడ్లకు ప్రతిపాదనలు రూపొందించింది. రిజర్వాయర్ల ద్వారా నీటిని సంపులు, పైపులైన్ల ద్వారా గ్రామాలకు అందించాలన్నదే వాటర్ గ్రిడ్ల లక్ష్యం. కాకపోతే అందుకు తగ్గ నీటి వనరులెక్కడున్నాయన్నది డాలర్ల ప్రశ్న. జిల్లాలో ప్రస్తుతం 10 రిజర్వాయర్లున్నాయి. వీటిలో 18 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ఇందులో 16 టీఎంసీలు ఇరిగేషన్‌కు విడుదుల చేస్తుండగా... కేవలం రెం డు టీఎంసీలను మాత్రమే ప్రస్తుతం తాగునీటి కింద విడుదల చేస్తున్నారు. అదే తొమ్మిది వాటర్ గ్రిడ్లను ఏర్పాటు చేయాలంటే 16 టీఎంసీల నీరు లభ్యం కావల్సి ఉంది. ఈ లెక్కన మరో 14టీఎంసీల నీరు అదనంగా తాగునీటి కోసం కేటాయిం చాల్సి ఉంది. ఆ మేరకు నీటి వనరులెక్కడ ఉన్నాయన్నదే ప్రశ్న. అంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే తప్ప వాటర్ గ్రిడ్స్ యోచన అమలయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకే సర్కార్ నిధులు కేటాయించడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. వీటికే దిక్కులేనప్పుడు కొత్త వాటి కోసం ఆలోచించడం అత్యాశే అవుతుంది. లేదంటే పోలవరం ప్రాజెక్టు నీరు తీసుకురావల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తయితేనే మార్గం సుగమమవుతుంది. నీటి లభ్యత అన్నది ఒక సమస్యైతే వాటర్ గ్రిడ్ల కోసం రూ.3,750కోట్లు ఖర్చు పెట్టడమనేది మరో సమస్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టగలదా అనేది సర్కార్కే ఎరుక. అటు నీటి వనరులు, ఇటు నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేయకుండా తొమ్మిది వాటర్‌గ్రిడ్‌ల ప్రతిపాదన ప్రణాళిక ఎలా తయారు చేశారన్నది అంతుచిక్కడం లేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ముందుకొస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగే అవకాశం లేదు. అంతవరకైనా రక్షిత మంచినీటి పథకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
రూ.20 కోట్లతో రేణిగుంటకు తెలుగు‘గంగ’
108 గ్రామాలకు పథకాన్ని అనుసంధానం చేస్తూ రూపకల్పన డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలనే దృఢ సంకల్పం రెండు రోజుల క్రితం ప్రారంభమైన పనులు చిత్తూరు(టౌన్): రాష్ర్ట ప్రభుత్వం రూ.20 కోట్ల తో రేణిగుంటకు రూ.20 కోట్లతో తెలుగుగంగ పథకాన్ని మంజూరు చేసింది. శ్రీకాళహస్తి నియో జకవర్గంలోని రేణిగుంట, దాని పరిసరాల్లో ఉన్న 108 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. రేణిగుంటలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో పాటు అధికంగా కుటుంబాలు నివసిస్తుండడం తో వారంతా తాగునీటికి ఇబ్బంది పడుతున్నా రు. రక్షిత మంచినీటి పథకాల బోర్లలో నీటిమట్టం అడుగంటిపోవడంతో తాగునీటి సమ స్య తీవ్రంగా ఉంది. దాంతో తాత్కాలిక ఉపశమనం కోసం జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, వాటి పరిధిలోని పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే నీరు అవసమని గుర్తించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి రేణిగుంటకు ప్రత్యేకంగా తాగునీటి పథకాన్ని మంజూరు చేయించుకున్నారు. 20 ఎంఎల్డీ కెపాసిటీతో... 20 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) కెపాసిటీతో ఈ తాగునీటి పథకాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూపకల్పన చేశారు. దీని పనులను డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలనే దృఢసంకల్పంతో మంత్రి ఉన్నారు. ఆ మేరకు చర్య లు చేపట్టాలని అధికారులను మంత్రి బొజ్జల ఆదేశించడంతో రెండు రోజుల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు గురువారం రేణిగుంటకు వె ళ్లి పనులను పరిశీలించారు. రేణిగుంటలో నివాసం ఉం టున్న కుటుంబాలతో పాటు పరిశ్రమలకు రోజు కు 6 ఎంఎల్డీ నీరు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పథకం ద్వారా వచ్చే 20 ఎంఎల్‌డీలో 6 ఎంఎల్డీ రేణిగుంటకు అందిస్తే మిగిలిన 14 ఎంఎల్డీ నీటిని పక్కనున్న 108 గ్రామాలకు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. పంపింగ్, లిఫ్టింగ్ ఆధారంగానే.. ఈ పథకం పూర్తిగా పంపింగ్, లిఫ్టింగ్ల ఆధారంగానే పనిచేస్తుంది. తెలుగుగంగ -చెన్నై మెయిన్ కెనాల్ నుంచి లిఫ్టింగ్ ద్వారా నీటిని రేణిగుంటకు తీసుకొస్తారు. ఆ తర్వాత పంపింగ్‌తో ఓవర్‌హెడ్ ట్యాంకులను నింపి గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. పంపింగ్, లిఫ్టింగ్‌లకు ప్రత్యేకంగా విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. అయితే స్వల్పకాలిక టెండర్ల పద్ధతిలో వీటిని చేపట్టనున్నారు. ఈ పథకానికి నాలుగు నెలల సమయం ఉన్నా మూడు నెలలు మాత్రమే కాంట్రాక్టర్లకు గడువిచ్చి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయూలనే కృతనిశ్చయంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు.