ప్లాంటు విస్తరణకు భూమిపూజ అనంతరం శంకుస్థాపన చేస్తున్న ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్
– రేణిగుంట ఈసీఐఎల్ విస్తరణ పనులకు భూమిపూజ
– ఈసీఐఎల్ సీఎండీ పి.సుధాకర్
రేణిగుంట : ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)లకు వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్) అనే పరికరాన్ని అవుర్చనున్నట్లు, తద్వారా ఓటరు వేసిన ఓటు నిర్ధేశిత అభ్యర్థికి పడిందా ? అని నిర్ధారించుకునే వీలుంటుందని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సీఎండీ పి.సుధాకర్ వెల్లడించారు. రేణిగుంట సమీపంలో ఉన్న ఈసీఐఎల్ కేంద్రంలో కొత్త ప్లాంటుకు ఆయన భూమిపూజ చేశారు. తవు సంస్థ 49ఏళ్లుగా అనేక రకాల ఉత్పత్తులతో దేశానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రధానంగా ఐదు విభాగాలైన రక్షణ, రోదసి, అణుశక్తి, భద్రత, ఐటీ అండ్ ఈ–గవర్నెన్స్‌కు అవసరమైన పరికరాలను తయారు చేస్తోందన్నారు. ఈ ఐదు రంగాల నుంచి సువూరు 2వేల కోట్లకు పైగా పరికరాల తయారీకి ఆర్డర్లు వచ్చాయని, దీంతో రేణిగుంట ప్లాంటును వురింత విస్తరిస్తున్నావుని చెప్పారు. తావుు తయారు చేసే పరికరాల్లో ఎలక్ట్రానిక్ ఫ్యూజులకు అధికంగా ఆర్డర్లు వచ్చాయన్నారు. విదేశీ సహకారంతో ఫ్యూజెస్‌లోని కొన్ని భాగాలను ఇక్కడ తయారు చేసేందుకు రూపకల్పన చేస్తున్నావున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సువూరు 5లక్షల ఈవీఎంలను తావుు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సారి ప్రయోగాత్మకంగా ఈవీఎంలకు అనుబంధంగా వీవీ ప్యాట్ పరికరాన్ని జతచేస్తునట్లు ఆయన పేర్కొన్నారు. నమూనాలను సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి అందించావుని, వారి నిర్ణయం మేరకు 2019 ఎన్నికలలో ఈ సరికొత్త ఈవీఎంలను వినియోగించనున్నారని తెలిపారు. ఐటీ అండ్ ఈ–గవర్నెన్స్‌కు అవసరమైన స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీలను తావుు ఇక్కడ ఏర్పాటు చేయనున్న విస్తరణ విభాగంలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.