VV payat
-
హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం
సాక్షి, కరీంనగర్: ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంల సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అభ్యర్థుల ఫొటో, గుర్తులు ఉన్న ఈవీఎంను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతుందన్న అపోహ ఓటర్లతో పాటు నేతల్లో ఉండేది. ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు. ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపించడంతో ఓటరు సంతృప్తి చెందుతాడు.ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ద్వారా లెక్కించిన తరువాత వీవీప్యాట్‌లోని చీటీలను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్ ఈవీఎంలు మొరాయించినా.. ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానం కూడా సాధ్యం కాకపోతే వీవీప్యాట్ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్ చీటీలను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ల్లను అమర్చడం వల్ల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి అనుమానాలకు తావుండదు. చదవండి: Huzurabad By Election Results 2021: హుజూరాబాద్ తీర్పు నేడే ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘100% వీవీప్యాట్’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్లు లెక్కింపులో దేశమంతటా వంద శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని కోరుతూ వచ్చిన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షాల ధర్మాసనం తాజాగా గుర్తుచేసింది. చెన్నైకి చెందిన ‘టెక్4ఆల్’ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. సీజేఐ ఇచ్చిన ఆదేశాలను తాము మార్చలేమనీ, ఈ పిటిషన్ వేయడం అర్థంలేని పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ 21 ప్రతిపక్ష పార్టీలు పిటిషన్ వేయగా, మే 7న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించడం తెలిసిందే. ఈవీఎంల ద్వారా మోసం సాధ్యం కాదు ఈవీఎంల ద్వారా మోసం చేయడం, వాటిని ట్యాంపర్ చేయడం పూర్తిగా అసాధ్యమని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రణవీర్ సింగ్ చెప్పారు. ఈవీఎంలు పారదర్శకమైనవని ఆయన పేర్కొన్నారు. ‘ఈవీఎంల డిజైన్ దృఢంగా ఉంటుంది. వాటిని ట్యాంపర్ చేయడం, హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వాటికి బయటి నెట్‌వర్క్‌తో కనెక్టివిటీ ఉండదు. ఈవీఎంలకు ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ వంటివి ఏవీ ఉండవు. కేవలం ప్రోగ్రామింగ్ చిప్ మాత్రమే ఉంటుంది. ప్రోగ్రామ్‌ను ఎవరైనా మార్చాలని చూస్తే ఈవీఎం తీవ్రంగా వైబ్రేట్ అయ్యి, స్విచ్ఛాఫ్ అయ్యి ఇక పనిచేయకుండా పోతుంది’ అని సింగ్ వివరించారు. ‘పరిశీలకుల’ పిటిషన్ విచారణకు నో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో ఎన్నికల పరిశీలకులుగా ఇద్దరు పదవీ విరమణ పొందిన ప్రభుత్వం ఉద్యోగుల నియామకాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో కేంద్ర పోలీస్ పరిశీలకుడిగా వివేక్ దుబేను, అలాగే పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక పరిశీలకుడిగా అజయ్ నాయక్‌లను నియమించారు. వారిద్దరినీ చట్ట విరుద్ధంగా నియమించారని, దీంతో ఎన్నికల సమయంలో కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశముందని పిటిషన్ పేర్కొంది. ‘ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్‌పై మేం ఎలాంటి విచారణ చేపట్టలేం’ అని కోర్టు పేర్కొంది. -
చివరలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ ఓట్లు, ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కించాకే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పార్టీలకు పడిన ఓట్ల సంఖ్యతో సరిపోలుస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు గురువారం హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 23 ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏయే స్థాయిలో ఏ ఓట్లు లెక్కించాలి. లెక్కించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. ఎన్నికల ఏజెంట్లతో వ్యవహరించాల్సిన తీరు.. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌లోని ఓట్లను లెక్కించాల్సిన పద్ధతి.. పరిశీలకుల సంతకాలకు ఉన్న ప్రాముఖ్యం తదితర అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను శిక్షణలో భాగంగా వివరించినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడిన నిజామాబాద్ నియోజకవర్గ ఓట్లను లెక్కించేందుకు 18 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అత్యధిక ఓటర్లున్న మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి 24 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్ భన్వర్‌లాల్, డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జాయింట్ సీఈవో ఆమ్రపాలి పాల్గొన్నారు. -
50% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై 21 ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ఏఎం సింఘ్వి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌కు బదులు ఏవైనా ఐదు బూత్‌లలో ఈవీఎంల ఫలితాలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది మొత్తం ఫలితాలలో కేవలం 2 శాతం మాత్రమే. దీనివల్ల ఉపయోగం లేదు. అందుకే కనీసం 50 శాతం ఫలితాలతో సరిపోల్చాలని మేం అడుగుతున్నాం. దీనిని 33 శాతం లేదా కనీసం 25 శాతం పెంచినా మాకు సంతోషమే. దీనివల్ల ఈసీ వ్యవస్థపై కేవలం రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లలోనూ ఆమోదయోగ్యతతోపాటు, విశ్వాసం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘ఒకవేళ, 5 పోలింగ్ బూత్‌లలో ఎలాంటి తేడాలు కనిపించకుంటే ఏం చేస్తారు? దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు లేవు’ అని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలో జరిగిన విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని ఈసీ తప్పుదోవ పట్టించిందని వారు పేర్కొనగా.. ప్రస్తుత వాదనలు కేవలం రివ్యూ పిటిషన్‌పై మాత్రమేనంటూ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 8వ తేదీనాటి తీర్పును సమీక్షించటానికి సిద్ధంగా లేమని తేల్చింది. ఈ బెంచ్ ఒక్క నిమిషంలో తీర్పు ముగించింది. వాదనలప్పుడు ప్రతిపక్ష నేతలు ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, చంద్రబాబు నాయుడు కోర్టు హాల్లోనే ఉన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్ష నేతలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక నియోజకవర్గానికి కేవలం 5 శాతం వీవీ ప్యాట్లు కాకుండా కనీసం 15 లేదా 25 శాతం లెక్కించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని 21 విపక్షాలు కోరాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఐ ఎంపీ డి. రాజా సహా పలు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిశారు. ఐదు శాతం వీవీప్యాట్ల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పు సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలతో 15 లేదా 25 శాతం వీవీప్యాట్లు లెక్కించేలా ఆదేశాలు ఇవ్వవచ్చని పార్టీలు పేర్కొన్నాయి. అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో పోలైన ఓట్లకు వీవీప్యాట్లలోని ఓట్లకు తేడాలోచ్చిన చోట మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని కోరారు. ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్లను లెక్కించా లని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థి రీకౌంటింగ్ కోరితే మళ్లీ లెక్కించాలని ఈసీని కోరినట్టు కూడా ఆ నేతలు మీడియాకు తెలిపారు. -
కొత్త ఈవీఎంలు వచ్చేశాయ్..
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు మంగళవారం కొత్తగా ఈవీఎం లు, వీవీ ప్యాట్లు చేరుకున్నాయి. బెంగళూరు నుండి ప్రత్యేక కంటైనర్లలో వచ్చిన వీటిని జిల్లా కేంద్రంలోని గోదాంకు చేర్చా రు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల నాయ కుల సమక్షంలో వీటిని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలనలో గోదాంల్లో భద్రపరిచారు. జిల్లాకు మొత్తం 1,770 ఈవీ ఎంలు, వీవీ ప్యాట్లు చేరుకున్నాయి. ప్రత్యేకంగా సీల్ చేసిన బాక్సుల్లో వచ్చిన ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచిన గోదాంల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తా మని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా నాయకుల సమక్షంలో ఓ బాక్స్‌ను తెరిచి కొత్త ఈవీఎం, వీవీ ప్యాట్ పనితీరును వివరించారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కొత్తగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు వచ్చిన సందర్బంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై రాజకీయ పార్టీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ జాబితాలు ఓసారి పరిశీలించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు చొరవ చూపాలని కోరారు. 18 ఏళ్లు నిండిన అందరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 25 లోపు నమోదు చేయాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ట్రెయినీ ఐఏఎస్ మిలింద్ బాప్నా, డీఆర్వో వెంకటేశ్వర్లు, నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు, ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హాదీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బెక్కెం జనార్దన్, బీజేపీ నాయకుడు అంజయ్యతో పాటు సీపీఐ, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాల్‌సెంటర్ పరిశీలన ఎన్నికల ఏర్పాట్లలో బాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్న కాల్‌సెంటర్‌ను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. కాల్సెంటర్లో ఏర్పాటుచేసిన 08542–241165 నంబర్‌కు ఎవరైనా ఫోన్ చేసి తమ వివరాలను చెబితే ఓటరు జాబితాలో పేరు ఉందా, లేదా పరిశీలించి చెబుతారు. ఈ మేరకు కాల్‌సెంటర్‌ను పని విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ నుంచి బుధవారం నుండి 4జీ కనెక్షన్ తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
ఇకపై ఈవీఎంలకు వీవీ ప్యాట్ అనుసంధానం
– రేణిగుంట ఈసీఐఎల్ విస్తరణ పనులకు భూమిపూజ – ఈసీఐఎల్ సీఎండీ పి.సుధాకర్ రేణిగుంట : ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)లకు వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్) అనే పరికరాన్ని అవుర్చనున్నట్లు, తద్వారా ఓటరు వేసిన ఓటు నిర్ధేశిత అభ్యర్థికి పడిందా ? అని నిర్ధారించుకునే వీలుంటుందని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సీఎండీ పి.సుధాకర్ వెల్లడించారు. రేణిగుంట సమీపంలో ఉన్న ఈసీఐఎల్ కేంద్రంలో కొత్త ప్లాంటుకు ఆయన భూమిపూజ చేశారు. తవు సంస్థ 49ఏళ్లుగా అనేక రకాల ఉత్పత్తులతో దేశానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రధానంగా ఐదు విభాగాలైన రక్షణ, రోదసి, అణుశక్తి, భద్రత, ఐటీ అండ్ ఈ–గవర్నెన్స్‌కు అవసరమైన పరికరాలను తయారు చేస్తోందన్నారు. ఈ ఐదు రంగాల నుంచి సువూరు 2వేల కోట్లకు పైగా పరికరాల తయారీకి ఆర్డర్లు వచ్చాయని, దీంతో రేణిగుంట ప్లాంటును వురింత విస్తరిస్తున్నావుని చెప్పారు. తావుు తయారు చేసే పరికరాల్లో ఎలక్ట్రానిక్ ఫ్యూజులకు అధికంగా ఆర్డర్లు వచ్చాయన్నారు. విదేశీ సహకారంతో ఫ్యూజెస్లోని కొన్ని భాగాలను ఇక్కడ తయారు చేసేందుకు రూపకల్పన చేస్తున్నావున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సువూరు 5లక్షల ఈవీఎంలను తావుు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సారి ప్రయోగాత్మకంగా ఈవీఎంలకు అనుబంధంగా వీవీ ప్యాట్ పరికరాన్ని జతచేస్తునట్లు ఆయన పేర్కొన్నారు. నమూనాలను సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి అందించావుని, వారి నిర్ణయం మేరకు 2019 ఎన్నికలలో ఈ సరికొత్త ఈవీఎంలను వినియోగించనున్నారని తెలిపారు. ఐటీ అండ్ ఈ–గవర్నెన్స్‌కు అవసరమైన స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీలను తావుు ఇక్కడ ఏర్పాటు చేయనున్న విస్తరణ విభాగంలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.