
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం వాసులు తిరుమల స్వామివారి దర్శనానికి జైలో వాహనంలో బయల్దేరారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఈ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్భన్ పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment