
దుండగులు తగలబెట్టిన బైక్..అంతర్‌చిత్రంలో కిడ్నాప్‌నకు గురైన ఖాదర్ బాషా
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. బుధవారం రోజున దుబాయ్ వెళ్లాల్సిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కిడ్నాప్‌నకు గురయ్యాడు. రేణిగుంటలో బైక్ మీద వెళ్తున్న ముగ్గురిపై గుర్తుతెలియని దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బైక్‌ను దహనం చేసి ఖాదర్ బాషా అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
ఖాదర్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కారం పొడి దాడి నుంచి తేరుకునే లోపే దుండగులు పారిపోయారు. దాదాపు నిన్న(మంగళవారం రాత్రి) జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్‌నకు గురైన ఖాదర్ బాషా బుధవారం రోజున దుబాయ్ వెళ్లాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment