
నేడు తిరుమలకు చంద్రబాబు
చిత్తూరు, : టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఐదు గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడినుంచి తిరుమలకు 6 గంటలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 7.30 గంటలకు బయల్దేరి తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళతారు. అనంతరం రేణిగుంట ద్వారా హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.