
తిరుమలలో సీఎం కుటుంబం
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, అందుకే జపాన్ తరహా పోరాటం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రాంతీయ పార్టీల సహకారంతో హక్కుల సాధాన పోరును ముమ్మరం చేస్తానన్నారు. మనుమడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి బుధవారం తిరుమల వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.
‘ప్రత్యేక హోదా పోరాటానికి సమాంతరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే జపాన్ తరహా పోరాటం చేస్తున్నాను. ఏపీ హక్కుల కోసం ప్రాంతీయ పార్టీల సహకారన్ని తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడితెస్తా. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని శ్రీవారిని ప్రార్థించా’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
భక్తులకు సేవలు: దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చిన చంద్రబాబు కుటుంబానికి అర్చకులు, టీటీడీ అధికారులు ఘనస్వాగతంపలికి, ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నప్రసాద భవనంలో భక్తులకు సీఎం కుటుంబీకులు సేవలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment