
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌కు అందిన సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రుయా ఆసుపత్రి సమీపంలో స్వామి వివేకానంద సర్కిల్ వద్దనున్న రిటైర్డ్ మేజర్ జనరల్, బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ని సత్కరిస్తారు.
అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని విజయజ్వాలను వెలిగిస్తారు. అనంతరం పలువురు సైనికులకు అవార్డులు అందజేస్తారు. సైనికులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment