
సాక్షి, తిరుపతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. స‍్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న నిర్మలా సీతారామన్‌కు టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద స్వాగతం పలికగా, విజయసాయి రెడ్డి కూడా స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కేంద్రమంత్రి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో...
Comments
Please login to add a commentAdd a comment