
నేడు జగన్ పర్యటన ఇలా
సాక్షి,చిత్తూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర రెండో రోజు పర్యటన మంగళవారం ఉదయం నగరి, సత్యవేడు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు.
పుత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి తాయిమాంబాపురం, పుత్తూరు బైపాస్ మీదుగా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం చేరుకుంటారు.
నారాయణవనంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారు.
తిరిగి పుత్తూరు చేరుకుంటారు. చిన్నరాజకుప్పం, పద్మసరస్సుల్లో రోడ్‌షో నిర్వహించి కార్వేటినగరం చేరుకుంటారు.
కార్వేటినగరంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఆర్‌కేవీవీపేట క్రాస్, రాజుల కండ్రిగ క్రాస్,పాదిరికుప్పం, కొల్లాగుంట, ముద్దుకుప్పం క్రాస్, నెలవాయి, ఎస్‌ఆర్‌పురం క్రాస్‌ల్లో రోడ్‌షో నిర్వహిస్తారు.