చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర కొనసాగుతోంది.
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను ముసలయ్యాగారి పల్లె నుంచి ప్రారంభించారు. అభిమానుల కోలాహలం మధ్య మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పల్లెప్రజలు చూపించిన ప్రేమానురాగాలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ్టి యాత్ర గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సాగనుంది. వీర్లగుడి ఎస్సీ కాలనీలో శిఖామణి సుగానందం కుటుంబాన్ని జగన్ ఓదారుస్తారు. నగరిలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్న అక్కడే రాత్రి బస చేస్తారు.